Hari Hara Veera Mallu Poster
ఎంటర్‌టైన్మెంట్

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ మారింది.. ఫైనల్‌గా ఆ ఐకానిక్ డేట్ ఫిక్సయింది

Hari Hara Veera Mallu Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు పాలిటిక్స్‌తో బిజీగా ఉంటూనే, మరోవైపు తను కమిటైన సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆయన పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో, ఆయన చేయాల్సిన సినిమాల షూటింగ్స్ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ దాదాపు చివరి స్టేజ్‌కు చేరుకుంది. వన్ వీక్ ఆయన డేట్స్ అడ్జస్ట్ చేస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. కానీ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో, ఆయన చిత్ర షూట్‌లో పాల్గొనలేదు. దీంతో మరోసారి ఈ సినిమా వాయిదా పడింది.

పవన్ కళ్యాణ్ సహకరిస్తే.. మార్చి 28నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. మేకర్స్ అధికారికంగా ఈ తేదీని ప్రకటించారు కూడా. మధ్యలో నిర్మాత ఏఎమ్ రత్నం కూడా కచ్చితంగా అదే తేదీకి వస్తామని అన్నారు. కానీ, పవన్ కళ్యాణ్ హెల్త్ సరిలేకపోవడం, ఆ వెంటనే పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీ కావడంతో ఆయన షూట్‌లో పాల్గొనలేదు. దీంతో మేకర్స్ మరోసారి వాయిదా వేస్తున్నట్లుగా తెలుపుతూ, మరో రిలీజ్ డేట్‌ని కూడా ఫైనల్ చేశారు.

Also Read: Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

ఆ ఐకానిక్ డేట్ ఫిక్స్:
ఈ సినిమా వాయిదా పడితే, మళ్లీ ఎప్పుడు విడుదల ఉంటుందనే విధంగా కొన్ని రోజులుగా సోషల్ మాధ్యమాలలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా మే 9న ఈ సినిమా విడుదల ఉంటుందనేలా చాలా పోస్ట్‌లు దర్శనమిస్తూ వస్తున్నాయి. మేకర్స్ ఇప్పుడు ఆ డేట్‌నే ఫిక్స్ చేశారు. మే 9కి ఉన్న విశిష్టత ఏమిటో మెగా ఫ్యాన్స్‌కి బాగా తెలుసు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రం ఆ తేదీనే విడుదలై చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ‘మహానటి’ సినిమా కూడా అదే తేదీన వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడా సెంటిమెంట్ పవన్ కళ్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా వరిస్తుందని మెగాభిమానులు భావిస్తున్నారు.

‘హరి హర వీరమల్లు’ సినిమాలో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కనిపించనున్నారు. మునుపెన్నడూ చూడని, చేయని సరికొత్త అవతార్‌లో పవర్ స్టార్ ఇందులో నటిస్తున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన రెడీ అవుతున్నారు. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు, ఫైనల్‌గా మే 9వ తేదీన థియేటర్లలోకి అడుగు పెట్టనున్నారు. మే 9న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుందని, ఆలస్యంగా వచ్చినా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

కొంతమేర క్రిష్ రూపొందించిన ఈ చిత్రం ప్రస్తుతం ఎ.ఎం. జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ కనిపించనున్నారు. అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: 

Jr NTR: తారక్‌లోని ఈ టాలెంట్‌ మీకు తెలుసా? రానా కళ్లల్లో నీళ్లు!

Bayya Sunny Yadav: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌పై కేసు నమోదు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు