Bayya Sunny Yadav (Image Source: Instagram)
ఎంటర్‌టైన్మెంట్

Bayya Sunny Yadav: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌పై కేసు నమోదు

Bayya Sunny Yadav: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేసినట్లుగా సూర్యాపేట డీఎస్పీ తెలిపారు. ‘‘సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్‌లో.. ఇన్‌స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీని వల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, అతనిపై నూతనకల్లు పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 5వ తేదీన కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. సందీప్ బైక్ రైడర్, యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా యాక్టివ్‌గా ఉంటాడు. బైక్‌పై వివిధ రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల యూత్ ఆకర్షించబడే ప్రమాదం ఉండటంతో కేసు నమోదు చేయడం జరిగింది’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Chiranjeevi – Nani: ఆసక్తికర విషయం చెప్పిన నాని.. ఎంతైనా మెగాస్టార్ కదా!

బెట్టింగ్ యాప్స్.. ఎంత ప్రమాదమో రోజూ న్యూస్ పేపర్లలో వచ్చే వార్తలు చూస్తుంటేనే తెలిసిపోతుంది. రూపాయి పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చు అంటూ వీక్ మైండెడ్ పీపుల్స్‌ని ఆకర్షిస్తూ.. అప్పుల పాలు జేయడం, ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడం వంటి వార్తలు ఎన్నో. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆన్‌లైన్ రుణాల పేరిట జరుగుతున్న మోసం, తద్వారా చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటం చూస్తుంటే ఎంతగా ఈ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ మానవుల మైండ్‌‌ని డైవర్ట్ చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి యాప్స్‌ని ప్రమోట్ చేసేవారెవరైనా సరే.. శిక్షార్హులే, వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరికలు జారీ చేసింది.

వైజాగ్‌కు చెందిన లోకల్ బాయ్ నాని పేరు మొన్నటి వరకు ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. ఇప్పుడు తెలంగాణకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ అనే మోటో వ్లాగర్‌పై కేసు నమోదవడంతో.. బెట్టింగ్ యాప్స్‌పై బీభత్సంగా దుమారం రేగుతుంది. సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌‌గా ఉండే వారు మంచి పనులు చేస్తూ, నలుగురికి స్ఫూర్తిగా ఉండాలి కానీ, ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసి సమాజంలో వారికున్న మంచి పేరును పోగొట్టుకుంటున్నారు. ఇది కూడా ఒక జూదం వంటిదే. ఈ జూదాన్ని వ్యసనంగా మార్చుకుని.. జీవితాలను నాశనం చేసుకుంటున్న వారందెరో ఉన్నారు. ఇలాంటి జూదపు క్రీడల్ని ప్రమోట్ చేసి జైలుపాలవుతున్న ఇన్‌ప్లూయెన్సర్స్ సంఖ్య కూడా పెరిగిపోతుంది.

సజ్జనార్ వంటి ప్రముఖులు రంగంలోకి దిగి, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి పేర్లను రివీల్ చేస్తున్నారంటే, విషయం ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఈ భయ్యా సన్నీ యాదవ్ గురించి తెలుగు యూట్యూబర్, మోటో వ్లాగర్‌ అయిన అన్వేష్ బయటపెట్టడం విశేషం. ఇక భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదవడంతో, సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలంగాణ డీజీపీకి, సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు.

‘‘బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌పై నేను చేసిన ‘ఎక్స్’ పోస్ట్ ఆధారంగా కేసు న‌మోదు చేసిన తెలంగాణ డీజీపీ, సూర్యాపేట ఎస్పీకి ధ‌న్య‌వాదాలు. కాసుల‌కు కక్కుర్తిప‌డి అమాయ‌కుల ప్రాణాల‌ను తీస్తామంటే న‌డ‌వదు. చ‌ట్ట‌ప్ర‌కారం మీరు శిక్ష అనుభ‌వించాల్సిందే. మాకు మిలియ‌న్లు, ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు.. డ‌బ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచ‌లు లెక్క‌పెట్టక త‌ప్ప‌దు..’’ అంటూ సజ్జనార్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇక భయ్యా సన్నీ యాదవ్‌‌పై కేసు నమోదవడంపై నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే.. ‘‘అరెస్ట్ ఒక్కటే కాదు సార్.. వాళ్ల ఆస్తి రికవరీ చేసి వాడిని నమ్మి బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్లకి, బెట్టింగ్ యాప్‌ల వల్ల అప్పుల పాలై, సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ల ఫ్యామిలీకి ఆ డబ్బు పంచండి సార్.. అదే నిజమైన న్యాయం..’’ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
Mahesh – Rajamouli: కాశీపట్నం చూడరబాబు.. కాన్సెప్ట్ ఇదేనా! జక్కన్నోయ్.. నీ మైండ్‌కి సలామ్!

Soundarya Husband: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు