Natural Star Nani
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi – Nani: ఆసక్తికర విషయం చెప్పిన నాని.. ఎంతైనా మెగాస్టార్ కదా!

Chiranjeevi – Nani: మెగాస్టార్ చిరంజీవి సమయస్ఫూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక సార్లు స్టేజ్‌పై ఆయన సమయానికి అనుకూలంగా అప్పటికప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంటారనేది ఇప్పటికే పలు సందర్భాలలో చూశాం. ఇప్పుడు స్వయంగా నాని ఫేస్ చేశానంటూ ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన నిర్మించిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ (COURT – State vs A Nobody) అనే సినిమా ప్రమోషన్స్‌లో రివీల్ చేశారు. ప్రస్తుతం నాని హీరోగానే కాకుండా నిర్మాతగానూ వరుస చిత్రాలతో దూసుకెళుతున్నారు.

‘హిట్’ సిరీస్ చిత్రాలలో భాగంగా రూపుదిద్దుకుంటోన్న ‘హిట్: ది 3rd కేస్’ చిత్రాన్ని నిర్మిస్తూ, హీరోగానూ నటిస్తున్నారు. అలాగే ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ చిత్రం కూడా ఆయన నిర్మాణంలో రూపుదిద్దుకుని విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు ఈ నేచురల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న మరో చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా అనంతరం ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా నాని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

Also Read- Ketika Sharma: కేతికా.. నీ పంట పండిందిపో! ‘అది ధ సర్‌ప్రైజ్’

ఇక ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ మార్చి 14న విడుదల కాబోతుండటంతో, చిత్ర ప్రమోషన్స్‌లో నాని కూడా పాల్గొంటున్నారు. తాజాగా చిత్ర టీమ్‌తో జరిగిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి నాని ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. ‘‘రీసెంట్‌గా నాగ చైతన్య పెళ్లికి వెళ్లాను. కారు దిగి మండపం లోపలికి వెళుతుండగా చిరంజీవిగారు ఎదురువచ్చారు. ప్రొడ్యూసర్ గారు బాగున్నారా? అని అంటే, నేను నా వెనుక ఎవరైనా వస్తున్నారేమో అని వెనక్కి చూశాను.

ఒకవేళ అశ్వినీదత్ వంటి నిర్మాత ఎవరైనా ఉన్నారేమో, ఆయనని పిలుస్తున్నారేమో అని వెనక్కి చూస్తూనే ఉన్నాను. ఎవరూ లేరు. మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారు అంటూ వచ్చి నన్ను హత్తుకున్నారు. ఆయన అలా పిలిచే సరికి నేను ఆశ్చర్యపోయాను..’’ అని నాని చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియదర్శి కూడా చిరంజీవితో జరిగిన అనుభవాన్ని తెలిపారు. ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమాకు సంబంధించి లాయర్ కోట్‌లో ఉన్న పోస్టర్ ఒకటి చూశారట.

‘నువ్వు ఆ లాయర్ సూట్‌లో చాలా బాగున్నావు. ఈ సినిమాకు నాని నిర్మాత కదా.. సినిమా హిట్ అవుతుందిలే’ అని చిరు అన్నట్లుగా దర్శి చెప్పుకొచ్చాడు. ఆయన మాటలు ఎంతో సంతోషాన్నిచ్చాయని ప్రియదర్శి చెబుతుంటే టీమ్ అంతా ఆనందించారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూలోని మెగాస్టార్‌కు సంబంధించి మాట్లాడుకుంటున్న బిట్ వైరల్ అవుతోంది. ‘ఊరికే మెగాస్టార్ అయిపోరు’ అంటూ మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
Jyothika: ‘కంగువ’పై కామెంట్స్ చేశారు, కానీ కొన్ని చెత్త సినిమాలకు.. ఇచ్చిపడేసిన జ్యోతిక

SSMB29: అడ్డడ్డే.. రాజమౌళికి ఎంత కష్టం వచ్చింది.. ఇక టార్చరే!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ