Ketika Sharma in Robinhood
ఎంటర్‌టైన్మెంట్

Ketika Sharma: కేతికా.. నీ పంట పండిందిపో! ‘అది ధ సర్‌ప్రైజ్’

Ketika Sharma Robinhood Song: అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రాబిన్‌హుడ్’ కేతికా శర్మ సాంగ్ వచ్చేసింది. ‘అది ధ సర్‌ప్రైజ్’ అంటూ వచ్చిన ఈ పాట విడుదలైన కాసేపటికే చార్ట్ బస్టర్ లిస్ట్‌లోకి చేరిపోయింది. ఇంతకీ ఇందులోని సర్‌ప్రైజ్ ఏంటని అనుకుంటున్నారా? ఈ పాటకు అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన సాహిత్యం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, కేతికా మల్లెపూల బ్లౌజ్‌లో వేసిన స్టెప్స్.. నిజంగా ఇవన్నీ ఈ పాటలో సర్‌ప్రైజ్‌లే. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ‘భీష్మ’ తర్వాత మరోసారి రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ రెండు మూడు వాయిదాల తర్వాత ఈ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు.

Also Read- India Won: ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా భారత్.. సెలబ్రిటీల రియాక్షన్ చూశారా!

అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా, ఇప్పుడు అసలు సిసలైన పాటను మేకర్స్ వదిలారు. చిత్రంలోని స్పెషల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నామంటూ ఇప్పటికే వదిలిన పోస్టర్స్, పాట కోసం వెయిట్ చేసేలా చేశాయి. ఇంకా ఎక్కువగా వెయిట్ చేయించడం ఇష్టంలేని మేకర్స్, సోమవారం ‘అది ధ సర్‌ప్రైజ్’ అంటూ లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అలా ఉంది ఈ పాటకు కొరియోగ్రఫీ. కచ్చితంగా కాంట్రవర్సీ అవుతాయనేలా కొన్ని స్టెప్స్‌ని ఇందులో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇక సాహిత్యం విషయంలో మాత్రం మరోసారి చంద్రబోస్ తన మార్క్‌ను ప్రదర్శించారు. ఎక్కడెక్కడికో లింక్ పెడుతూ, ఆయన అల్లిన పదమాలిక అందరినీ నిజంగానే సర్‌ప్రైజ్ చేస్తుంది.

జీవీ ప్రకాష్ కుమార్ ఇచ్చిన బాణీలు వినగానే ఎక్కేస్తున్నాయి. ఇక కేతిక విషయానికి వస్తే, కొన్నాళ్లుగా ఆమెకు సరైన అవకాశం రావడం లేదు. దేనికి అనుకుంటున్నారా? సినిమా అవకాశాల సంగతి కాదు, గ్లామర్ ప్రదర్శనకు అవకాశం లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్ పోస్ట్ చేసి చేసి బోర్ కొడుతున్నట్టు ఉంది. అందుకే ఈ పాటలో జాస్మిన్ బ్లౌజ్ వేసుకుని ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్ ఇస్తుంటే కుర్రాళ్లు కుదేలవుతున్నారు. పాటను రిపీటెడ్ మోడ్‌లో వాయించేస్తున్నారు. అంతగా కేతికా తన పరువాలతో ఈ పాటకు గ్లామర్‌ని తెచ్చింది. సర్‌ప్రైజ్ చాలదు అన్నట్లుగా పాట చివరిలో నితిన్, శ్రీలీల ఎంట్రీ నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు. మొత్తంగా అయితే, ఈ పాటతో ఈ సినిమాకు కావాల్సిన ప్రమోషన్ వచ్చేసిందని ఫిక్స్ అయిపోవచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
Ananya Panday: బికినీలో.. ‘లైగర్’ బ్యూటీ కంట్రోల్ తప్పింది

Ram Gopal Varma: పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు? వర్మ సమాధానమిదే!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ