SSMB29: దర్శకధీరుడు రాజమౌళికి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఒక్క సినిమాకే ఏళ్లకు ఏళ్లు తినేసే రాజమౌళి, ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడంలోనూ చాలా కసరత్తులు చేస్తుంటారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే, సినిమా అంత గొప్పగా వస్తుందని నమ్మే దర్శకుల్లో రాజమౌళి ఒకరు. అంతా ముందే రెడీ చేసుకుని షూట్ కెళ్లడం తప్పితే, మధ్యలో ప్లానింగ్ మార్చుకోవడం, స్పాట్‌లో మార్పులు చేయడం వంటివి రాజమౌళికి పెద్దగా నచ్చదు. అందుకే సినిమా ప్రారంభానికి ముందే రాజమౌళి (SS Rajamouli) అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమా మొదలై, సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి థియేటర్లలోకి వచ్చే వరకు ఒక చంటి బిడ్డని సాకినట్లు ఆ సినిమాను చూసుకుంటాడు. ప్రతి డైరెక్టర్ చేసే పని ఇదేలే కానీ, జక్కన్న చెక్కుడులో మాత్రం చాలా తేడా ఉంటుంది. అందుకే ఆయన నేషనల్, ఇంటర్నేషనల్ గుర్తించే స్థాయికి చేరుకున్నారు. మరి అలాంటి దర్శకుడికి ఇప్పుడు పెద్ద చిక్కులే వచ్చి పడ్డాయి. ఏంటా చిక్కులు అని అనుకుంటున్నారా?
Also Read- India Won: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. సెలబ్రిటీల రియాక్షన్ చూశారా!
లీకులు.. అవును. ఈ సమస్య ఈ మధ్య కాలంలో ప్రతి దర్శకుడు ఫేస్ చేస్తున్నదే కానీ, రాజమౌళి అంతా పకడ్బందీగా రెడీ చేసుకున్న తర్వాతే షూట్ మొదలెడతారు. అయినా కూడా ఆయన చేస్తున్న SSMB29 షూటింగ్ లొకేషన్ నుంచి వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుండటంతో టీమ్ అంతా షాకయింది. బాహుబలి (Bahubali) సమయంలో ఇలాంటిదే జరిగితే, లొకేషన్‌లో ఎవరి చేతుల్లో ఫోన్ ఉండకూడదనే రూల్ పెట్టాడు జక్కన్న. ఆర్ఆర్ఆర్ (RRR Movie) విషయంలో చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాడు. కానీ, ఇలా మొదలు పెట్టాడో లేదో, అలా లీకులు దర్శనమిస్తుండటంతో మహేష్ బాబు (Super Star Mahesh Babu)తో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి బాగా డిజప్పాయింట్ అయ్యాడనేలా వార్తలు వినబడుతున్నాయి.
అంతేకాదు, ఏదయితే లీక్ అయిందో.. ఆ సీన్స్‌ని పూర్తిగా తొలగించారనేలా కూడా టాక్ వినబడుతుంది. అంతేనా, ఆ వీడియోని ఫోన్‌లో బంధించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారెవరనేది కూడా జక్కన్న తెలుసుకున్నాడని, వారిని శాశ్వతంగా యూనిట్ నుంచి తొలగించాడనేది తాజా సమాచారం. తన సినిమా షూట్ విషయంలో అంత కేర్ తీసుకున్నా, వీడియో లీక్ అవడంతో.. యూనిట్‌పై జక్కన్న సీరియస్ అయ్యాడని, సొంతం ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఫోన్ ఉంటే సెట్‌లోకి రానివ్వకూడదనే నిర్ణయం ఆయన తీసుకున్నాడని యూనిట్ మెంబర్స్ అనుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమా గురించి పబ్లిక్‌కి తెలియకూడదనే, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనే.. కనీసం షూటింగ్ మొదలైనట్లుగా కూడా ఆయన అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయినా కూడా, లీక్స్ జరుగుతున్నాయంటే.. ఇకపై జక్కన్న చూపించే టార్చర్ మాములుగా ఉండదనేలా యూనిట్ అంతా భయపడుతోందట.. అది మ్యాటర్.
ఇవి కూడా చదవండి:
Ananya Panday: బికినీలో.. ‘లైగర్’ బ్యూటీ కంట్రోల్ తప్పింది
Ram Gopal Varma: పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు? వర్మ సమాధానమిదే!