Soundarya Husband
ఎంటర్‌టైన్మెంట్

Soundarya Husband: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!

Soundarya Husband: మంచు ఫ్యామిలీని వివాదాలు ఒదిలిపెట్డడం లేదు. వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల మంచు మోహన బాబు కుటుంబ గొడవలు హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా దివంగత నటి సౌందర్యది ప్రమాదం కాదని.. మోహన్ బాబు హత్య చేయించాడంటూ వార్తలు వైరల్ అయితున్నాయి. అంతేగాక శంషాబాద్ జల్లేపల్లిలో సౌందర్యకు చెందిన ఫామ్ హౌస్‌ని మోహన్ బాబు కబ్జా చేసుకొని అనుభవిస్తున్నాడని పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో సౌందర్య భర్త రఘు స్పందించారు. ఇవన్నీ తప్పుడు వార్తలు అంటూ కొట్టి పారేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. మోహన్ బాబు కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.

సౌందర్య మరణించిన నుంచి గత 25 సంవత్సరాల నుంచి మోహన్ బాబు కుటుంబంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నానని తెలిపారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవని వెల్లడించారు. సౌందర్య, తాను, తన అత్త అందరం ఆయనతో మంచి సంబంధాలు మెయింటైన్ చేశామని, ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని అన్నారు. మోహన్ బాబుకు అండగా నిలవడానికి ఈ రోజు స్పందించానని పేర్కొన్నారు.

ఇక సౌందర్య స్టార్ హీరోయిన్‌గా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అలనాటి సావిత్రి తర్వాత టాలీవుడ్‌కి దొరికిన డెమండ్ అని తన గురించి గొప్పగా చెప్పేవారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. స్టార్ హీరోలందరితో వరుసగా మూవీస్ చేసి కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టింది.

ఇక అప్పుడే హెలికాప్టర్  ప్రమాదంలో మృతి చెందింది. అయితే సౌందర్య మరణాంతరం ఆస్తులు ఆమె తల్లితండ్రులు స్వాధీనం చేసుకున్నారని, అయితే జల్లేపల్లిలో ఉన్న భూమి మంచు మోహన్ బాబు కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ స్థలంలోనే మంచి మోహన్‌బాబు మంచి ఇల్లు కట్టుకున్నారని అన్నారు. మంచు టౌన్‌షిప్ పేరుతో ఉన్న ఆ ఇంట్లోనే మోహన్‌బాబు ప్రస్తుతం ఉంటున్నారట.

అయితే.. జల్లేపల్లిలో మంచు టౌన్ షిప్ ల్యాండ్ సౌందర్యదే అంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే సౌందర్యను మోహన్ బాబు హత్య చేయించాడంటూ ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురు గట్ల చిట్టిబాబ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.

Also Read: డేటింగ్ వార్తలు నిజమేనా?.. హీరో తల్లి ఇలా హింట్ ఇచ్చిందేంటి?

జల్లేపల్లిలో ఉన్న 6 ఎకరాల ల్యాండ్ మోహన్ బాబు అడగ్గా.. సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడంతో కక్షపెంచుకున్న పార్టీ ప్రచారానికి వస్తున్న ఆమెను హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత గెస్ట్‌హౌస్‌ని అక్రమంగా అనుభవిస్తున్నాడని ఆరోపించాడు. ఈ క్రమంలోనే మోహన బాబు గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సౌందర్య భర్త రఘు స్పందించాల్సి వచ్చింది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం