Mahesh - Rajamouli (image source: canva)
ఎంటర్‌టైన్మెంట్

Mahesh – Rajamouli: కాశీపట్నం చూడరబాబు.. కాన్సెప్ట్ ఇదేనా! జక్కన్నోయ్.. నీ మైండ్‌కి సలామ్!

Mahesh – Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు – టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫాస్ట్‌గా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీగా సెట్స్ వేసి కొన్ని ప్రధాన సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం ఒరిస్సాలోని అడవుల్లో మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ చాలా రోజులు పాటు షూటింగ్ జరుగనుంది. మూవీలో మెయిన్ సీన్స్ ఇక్కడే చిత్రీకరిస్తున్నారట.

ఈ మూవీ షూటింగ్‌లో ఇదే లాంగ్ షెడ్యూల్ అట. మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా వంటి నటుల పాత్రలు ఇక్కడ చిత్రీకరిస్తున్నారట. అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తుండటంతో కొందరు సీక్రెట్‌గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీల్ చైర్‌లో ఉన్న విలన్ ముందు మహేష్ బాబు కూర్చోని ఉన్న ఓ వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

అయితే ఇలా వీడియోస్ లీక్ కావడంపై రాజమౌళి సీరియస్‌గా ఉన్నారట. లీక్ అయిన వీడియోస్ సోసల్ మీడియాలో డిలీట్ చేసే పనిలో పడ్డారట రాజమౌళి. ఈ క్రమంలోనే రాజమౌళి సెట్స్‌లో వీడియోలు, ఫోటోలు తీయకుండా జాగ్రత్తలు వహిస్తున్నాడట. అయినా కూడా ఏదో ఒక రూపంలో వీడియోలు, ఫోటోలు బయటికి వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ స్టోరీ కాశీ క్షేత్రంతో ముడిపడి ఉంటుందని ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. మహేష్ బాబు కాశీలో పుడతాడని, అక్కడే ఆయన ప్రయాణం ప్రారంభం అవుతుందని.. అక్కడ నుంచి మహేష్ బాబు అడవుల్లోకి వెళ్తాడని అంటున్నారు. అందుకే కాశీ పరిసరాలు, మణికర్ణిక ఘాట్‌కి సంబంధించి భారీ ఎత్తున సెట్స్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు.

Also Read: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!

ఇందులో మహేష్ బాబు రోల్ సరికొత్తగా ఉండబోతుందట. రామాయణంలోని హనుమంతుడు స్ఫూర్తితో మహేష్ బాబు పాత్ర విజయేంద్ర ప్రసాద్ రూపొందించారని తెలుస్తుంది. ఈ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే రాజమౌళి మహేష్ బాబు రోల్‌కి సంబంధించి కొన్ని హింట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ రోల్ ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. కాశీ నుంచి అడవుల్లోకి ఎందుకు వెళుతాడనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ కావడంతో భారీగా అంచనాలు ఉన్నాయి. మొత్తం రెండు ఏండ్ల పాటు షూటింగ్ జరుగనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రూ. 1000 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీకల్ ఎక్స్‌పెర్ట్స్ భాగం కానున్నారు. గతేడాది ‘గుంటూరు కారం’ తో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేపోయింది. ఈ మూవీతో భారీ హిట్‌ని సొంతం చేసుకోవాలని మహేష్ బాబు కోరుకుంటున్నారట. ఈ మూవీలో మహేష్ బాబు ఇప్పటి వరకు చేయని సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!