Megastar Chiranjeevi
ఎంటర్‌టైన్మెంట్

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ఇటీవల కొన్ని వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు యు.కె. ప్రభుత్వం అక్కడి పౌరసత్వాన్ని ఇచ్చి గౌరవించిందనేలా వచ్చిన వార్తలను వెంటనే చిరంజీవి టీమ్ ఖండించి క్లారిటీ ఇచ్చింది. అసలు యు.కె. ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలుపుతూ ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన ప్రకారం మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం వరించింది. మెగాస్టార్ డా. చిరంజీవి కొణిదలకు హౌస్ ఆఫ్ కామ‌న్స్ – యు.కె పార్ల‌మెంట్‌లో గౌరవ స‌త్కారం జరుగనున్నది. ఎందుకంటే,

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యుకెకి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19వ తేదీన యుకెలో గ్రాండ్‌గా స‌న్మానించ‌నున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ స‌హా ఇత‌ర పార్ల‌మెంట్ స‌భ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలుస్తుంది. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ, సినిమా మరియు ప్రజాసేవ విషయంలో చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్‌షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నట్లుగా ఈ ప్రకటనలో తెలిపారు.

Also Read: Bayya Sunny Yadav: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌పై కేసు నమోదు

బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యు.కె‌లో పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేసే ఒక ప్రముఖ సంస్థ. అలాగే వివిధ రంగాలలోని వ్యక్తులు సాధించిన విజయాలను, అలాగే వారు తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్ర‌భావాన్ని మ‌రింతగా విస్తృతం చేయాలనే ఉద్దేశంతో.. అలాంటి వారిని వెతికి మరీ సత్కరిస్తుంటుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా అంద‌జేస్తుండగా.. దానిని చిరంజీవి అందుకోనుండ‌టం విశేషం. ఇది ఆయ‌న కీర్తి కీరీటంలో మ‌రో క‌లికితురాయిగా చెప్పుకోవచ్చు.

యు.కెకు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవి సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డ్ ఇవ్వ‌టం అనేది మెగాభిమానులకు పండగలాంటి సందర్భం. 2024లో భార‌త ప్ర‌భుత్వం నుంచి రెండో అత్యున్న‌త‌ పౌర పుర‌స్కారం పద్మ విభూష‌ణ్‌‌ను చిరంజీవి అందుకున్న విషయం తెలిసిందే. అలాగే గత ఏడాది అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆయన స్థానం సంపాదించుకున్నారు. అలాగే ఏఎన్నార్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా, అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్‌.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసిన విషయం తెలియంది కాదు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠతో ఆయన ‘విశ్వంభర’ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా అనంతరం, ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమాకు సైన్ చేసి ఉన్నారు.

ఇవి కూడా చదవండి:
Court Movie Review: కోర్ట్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Jr NTR: తారక్‌లోని ఈ టాలెంట్‌ మీకు తెలుసా? రానా కళ్లల్లో నీళ్లు!

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!