Sivaji Actor
ఎంటర్‌టైన్మెంట్

Sivaji: ‘యానిమల్’లోని బాబీ డియోల్ కంటే బాగా చేశానని రాశారు.. చాలా హ్యాపీగా ఉంది

Sivaji: నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో సమర్పించిన చిత్రం ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకుడు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలకు ముందే ప్రదర్శించిన ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుని, మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా పాజిటివ్ స్పందనను రాబట్టుకుని, సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ఇందులో నటుడు శివాజీ చేసిన మంగపతి పాత్ర ట్రెమండస్ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో శివాజీ మీడియా ముందుకు వచ్చి, తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

‘‘దాదాపు 12 ఏళ్ల తర్వాత మంగపతి వంటి పవర్ ఫుల్ పాత్రతో రావడం చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్యామిలీ, పిల్లలు నన్ను మళ్ళీ యాక్ట్ చేయమని కోరేవారు. నాకు కూడా చేయాలని వుండేది కానీ నేను ఎవరినీ అడగలేను. ఈటీవీ బాపినీడుని కలిసి విషయం చెప్పాను. ముందుగా ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నాం. అయితే ఆయన కూడా యాక్ట్ చేయమని చెప్పారు. అలా ‘90స్’ వెబ్ సిరీస్ ఓకే చేశాను. అది చేస్తున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. నేచరే ఈ అవకాశం కల్పించిందనుకుని వెళ్లాను. ఆ షోతో అసలు శివాజీ అంటే ఏమిటో, ఎలాంటివాడో ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో ‘90స్’ కూడా పెద్ద హిట్ అయ్యింది. దాని తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. సుమారు ఎనభై కథలు విన్నాను. చాలా వరకూ ఫాదర్ రోల్సే ఉన్నాయి. అందులో చాలా రిజెక్ట్ చేశాను. ఇప్పుడీ ‘కోర్ట్’లో చేసిన మంగపతి క్యారెక్టర్ నా 25 ఏళ్ల కల. నాని ద్వారా ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది.

Also Read- Sambarala Yetigattu: హోలీ సంబరాల్లో మునిగిపోయారు.. ఇది దేనికి సంకేతం?

‘మంగపతి’ (Mangapathi) పాత్ర ఓకే చేసే ముందు.. ఏం చూసి ఈ పాత్రకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారని డైరెక్టర్‌ని అడిగాను. పగలంతా స్క్రిప్ట్ రాసుకొని నైట్ టీవీ ముందు కూర్చుంటే మీరే కనిపించేవారు. ఆ పాత్రకి పర్ఫెక్ట్‌గా మీరు సరిపోతారనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు. నా పాత్రకి సంబంధించి వస్తున్న ప్రతీది డైరెక్టర్‌కే చెందుతుంది. నేను ఇది చేయగలనని నమ్మి అవకాశం ఇచ్చాడు. నా పాత్రని నెక్స్ట్ లెవల్లో రాసుకున్నాడు. ఇందులో ప్రతి పాత్రని శిల్పం చెక్కినట్లుగా చెక్కాడు. ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య, రాజనాల వంటివారు ఎన్నో మరపురాని పాత్రలు చేశారు. అలాంటి పాత్రలు చేయాలని నాకూ వుండేది. హీరోగా స్టిక్ అవ్వాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు. ‘జల్సా, ఒట్టేసి చెబుతున్నా, మనసుంటే చాలు’ వంటి సినిమాల్లో చేసిన పాత్రలు చేయడానికి కారణం అదే.

మంగపతి పాత్రలో సహజమైన ఎమోషన్ వుంది. ప్రతి కుటుంబంలో అలాంటి ప్రొటెక్టివ్ నేచర్ వున్న వ్యక్తి వుంటారు. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలానే బిహేవ్ చేస్తాడు. ఆ పాత్రకి వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ‘యానిమల్’ (Animal)లో బాబీ డియోల్ కంటే బాగా చేశానని ఒకరు రివ్యూ రాశారు. ఆ మాట విన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సందర్భంగా నా పిల్లలకు, భార్యకు, బాపినీడుకు, రామ్ జగదీశ్‌కు, నిర్మాత నానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాని (Natural Star Nani) యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న నటుడు. నిర్మాతగా ఆయనపై నాకు చాలా గౌరవం వుంది.. ఎందుకంటే, కొత్త వారిని ప్రోత్సాహించడంలో చాలా గొప్ప‌గా చొరవ చూపిస్తున్నాడు. నాకు తెలిసి ముందు ముందు సూపర్ గుడ్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్, ఉషా కిరణ్ వంటి బ్యానర్స్‌లా వాల్ పోస్టర్ సినిమా నిలుస్తుంది. ఈ బ్యానర్‌లో ‘కోర్టు’ సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. మంగపతి తరహలో ‘మెడికల్ షాప్ మూర్తి’ అనే ఓ క్యారెక్టర్ విన్నాను. త్వరలోనే వాళ్ళు ప్రకటిస్తారు. ఇంకా లయ, నేను కలిసి ఒక సినిమా చేస్తున్నాం. ‘దండోరా’ అనే మరో సినిమాతో పాటు ‘90స్’ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌లో చేస్తున్నాను..’’ అని శివాజీ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Puri Jagan – Charmy: పూరి జగన్ – ఛార్మీల మధ్య ఏం జరిగింది? వారిద్దరూ నిజంగా విడిపోయారా?

Robinhood: నితిన్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన దర్శకుడు.. కామ్‌‌గా పరుగో పరుగు!

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?