Puri Jagan – Charmy: డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ పేజీ ఎప్పుడో క్రియేట్ అయింది. స్టార్ డైరెక్టర్స్‌లో ముందు వరసలో ఉండే పూరి, గత కొన్నాళ్లుగా పడి లేస్తూ కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. ఆయన హీరోని చూపించే విధానం, రాసే డైలాగ్స్‌కి ప్రత్యేకంగా అభిమానులున్నారు. మరో విశేషం ఏమిటంటే, ఆయన మేకింగ్‌కి స్టార్ డైరెక్టర్స్, రైటర్స్ అభిమానులవడం.
అవును, రాజమౌళి వంటి వారు కూడా కుళ్లుకునే దర్శకుడు పూరి జగన్ (Director Puri Jagannadh). ప్రతి ఒక్క దర్శకుడు మేకింగ్ విషయంలో పూరి జగన్‌ని ఫాలో అవ్వాలని కోరుకుంటారంటే, ఆయన స్టార్‌డమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలకు కథలను అందించిన వివి విజయేంద్ర ప్రసాద్ వంటి స్టార్ రచయిత.. తన కుమారుడు రాజమౌళి ఫొటో కాకుండా, పూరి ఫొటోని ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకుంటారంటే, ఆయన క్రేజ్ ఏంటో క్లారిటీకి వచ్చేయవచ్చు.
Also Read: Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ మారింది.. ఫైనల్‌గా ఆ ఐకానిక్ డేట్ ఫిక్సయింది
అలాంటిది కొన్నాళ్లుగా పూరి పాచిక పారడం లేదు. ఆయన ఎంతగా ఎఫర్ట్ పెట్టినా, హిట్ మాత్రం అందని ద్రాక్షగానే మారుతుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన పాన్ ఇండియా ‘లైగర్’ తీవ్ర నిరాశను మిగిల్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా పూరీని నిలబెట్టలేకపోయింది. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు కూడా వెనుకాడుతున్నారు. ఎలాంటి దర్శకుడు, ఎలా అయిపోయాడు అంటూ ఆయన అభిమానులే జాలి చూపించే పరిస్థితి నెలకొంది.
దీనికి కారణం ఏమిటి? అంటే, సహవాస దోషం అని చెప్పకతప్పదు. స్టార్ హీరోలు సైతం ఆయన కోసం క్యూ కట్టే పొజిషన్ నుంచి, ప్రస్తుతం పూరి అంటే చాలు ముఖం చాటేసే పరిస్థితి నెలకొంది అంటే, కచ్చితంగా అది సహవాస దోషమనే చెప్పుకోవాలి. చార్మింగ్ బ్యూటీ ఛార్మీ (Charmy Kaur)తో ఎప్పుడైతే ఆయన సహవాసం మొదలైందో, అప్పటి నుంచి పూరీ స్టార్‌డమ్‌కు బీటలు వారుతూ వస్తున్నాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించి, నటి ఛార్మితో కలిసి పూరీ జగన్ సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. నిర్మాతగా ఆయన డబ్బులెన్ని సంపాదించారో తెలియదుకానీ, దర్శకుడిగా మాత్రం పూరి తన ఇజ్జత్ మొత్తం పోగొట్టుకుంటూ వస్తున్నారు.
నిర్మాతగా తలనొప్పులు ఎందుకుని అనుకున్నారో, లేదంటే ఈ సహవాసం బోర్ కొట్టిందో తెలియదు కానీ.. ఛార్మితో పూరి విడిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఛార్మి కారణంగా ఆయన వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తలెత్తినట్లుగా ఆ మధ్య బండ్ల గణేష్ వంటి వారు బహిరంగంగానే ప్రకటించారు. ప్రపంచాన్ని చదివినట్లుగా పాడ్ కాస్ట్ వీడియోలు పోస్ట్ చేసే పూరి.. ఇప్పుడు తన జీవితాన్ని తాను తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే, ఛార్మితో నిర్మాణ సంబంధాలకు బ్రేస్ వేసి, దర్శకుడిగా తన సత్తా ఏంటో మరోసారి చాటేందుకు రెడీ అవుతున్నాడనేలా ఈ డ్యాషింగ్ డైరెక్టర్ గురించి టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఎప్పుడైతే పూరి ఈ నిర్ణయం తీసుకున్నాడో.. టాలీవుడ్ స్టార్ హీరో నుంచి ఆయనకు ఆఫర్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. పూరి తన తదుపరి చిత్రాన్ని కింగ్ నాగార్జునతో చేయబోతున్నట్లుగా టాక్ వినబడుతుంది. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో ‘సూపర్’, ‘శివమణి’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో మూవీ తెరకెక్కనుంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
ఇవి కూడా చదవండి:
Kiran Abbavaram: రాయలసీమ నుంచి మోహన్ బాబు ఫ్యామిలీ ఒక్కటే ఉంది.. ఇండస్ట్రీకి ఇంకా రావాలి!
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం