Dilruba Tirupati Press Meet
ఎంటర్‌టైన్మెంట్

Kiran Abbavaram: రాయలసీమ నుంచి మోహన్ బాబు ఫ్యామిలీ ఒక్కటే ఉంది.. ఇండస్ట్రీకి ఇంకా రావాలి!

Kiran Abbavaram: రాయలసీమ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారని అన్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ‘క’ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఆయన నటించిన చిత్రం ‘దిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్, ఖ్యాతి హీరోయిన్లుగా నటించారు. శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ స్పెషల్‌గా థియేటర్లలోకి రాబోతుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..

Also Read- Chiranjeevi – Nani: ఆసక్తికర విషయం చెప్పిన నాని.. ఎంతైనా మెగాస్టార్ కదా!

‘‘రాయలసీమ సైడ్ ఎలా ఉంటుందంటే, సినిమాల్లోకి వెళతామంటే.. తెలియకుండా వెనక్కి లాగేసేవాళ్లే ఎక్కువగా ఉంటారు. అరే.. అది అవ్వదు, మనం వెళ్లి అక్కడ చేయలేం. మనవాళ్లు ఎవరూ లేరు అనే వాళ్లే ఎక్కువగా ఉంటారు. మాములుగా ఒక పిల్లాడిని బయటికి పంపించాలంటే, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్లు ఉంటేనే పంపిస్తాం. మన సైడ్ నుంచి తక్కువైపోవడం వల్ల, అక్కడ ఎవరున్నారు? ఎవరు చూసుకుంటారనే భయంతో ఆపేసే వాళ్లే ఎక్కువ ఉన్నారు.

అందుకే మన రాయలసీమ నుంచి చూస్తే, ఒక్క మోహన్ బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu Family) తప్ప, హీరోగా ఎవరూ లేరనే ఫీలింగ్ నాకుంది. రాయలసీమలో ఉన్న మీడియా సంస్థలు కూడా దీనిపై కాస్త అవగాహన కల్పిస్తే.. ఇండస్ట్రీకి చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఒకరికి ఒకరు సపోర్ట్ చేస్తే, మన సైడ్ నుంచి కూడా ఎక్కువ మంది వస్తారని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో చాలా మంది కుర్రవాళ్లు రాయలసీమ నుంచి ఇండస్ట్రీలో ఉంటారని అనుకుంటున్నాను. అన్ని ఏరియాల నుండి అందరూ రావాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

‘దిల్ రూబా’ (Dilruba) సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ 30 మినిట్స్ సరదాగా ఉంటుంది. ఆ తర్వాత అసలు కథలోకి తీసుకెళ్తుంది. ఇంటర్వెల్‌కు అరగంట ముందు నుంచి.. ఈ సినిమా ఫుల్ హై ఇస్తుంది. ఈ కథలో ప్రేమ ఒక్కటే కాదు స్నేహం, ఫాదర్ సన్, ఫాదర్ డాటర్ రిలేషన్.. ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎక్స్ లవర్ మళ్లీ ఆ ప్రేమికుడి జీవితంలోకి వచ్చి అతని ప్రెజెంట్ లవ్‌ను కలిపే ప్రయత్నం చేయడం అనేది ఇందులో కొత్తగా ఉంటుంది. మాజీ ప్రేయసి, ప్రేమికుడు అంటే శత్రువులని అంతా అనుకుంటూ ఉంటారు.

కానీ అలా చూడాల్సిన అవసరం లేదని, వారితోనూ స్నేహాన్ని కొనసాగించవచ్చు అనే ఫీల్ గుడ్ ఎలిమెంట్ ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరూ ఫ్యామిలీతో వచ్చి హాయిగా ఈ సినిమా చూడొచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే లెంగ్తీ ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాను. యాక్షన్ సీన్స్ హైలెట్‌గా ఉంటాయి. రుక్సర్, ఖ్యాతీ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. డైలాగ్స్ అప్పటి పూరి సినిమాలను గుర్తుకు తెస్తాయి. ‘తిరుపతి’పై నేను సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఈసారి చేయాల్సి వస్తే.. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ సినిమా చేయాలని ఉందని కిరణ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:
Mahesh – Rajamouli: కాశీపట్నం చూడరబాబు.. కాన్సెప్ట్ ఇదేనా! జక్కన్నోయ్.. నీ మైండ్‌కి సలామ్!

Soundarya Husband: హైదరాబాద్‌లోని ఆస్తులపై సౌందర్య భర్త వివరణ.. మోహన్ బాబు సేఫ్!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!