Robinhood Promotions: విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతికి వచ్చి ఎలాంటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఓటీటీలో విడుదలైనా, ఇంకా కొన్ని చోట్ల థియేటర్లలో ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర టీమ్, ముఖ్యంగా వెంకటేష్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న తీరు అందరికీ ఓ పాఠంగా మారింది. అంతటి స్టార్ హీరో ప్రమోషన్స్ కోసం పరుగులు పెడుతూ, పెట్టిస్తూ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లారు. ఇప్పుడిదే రూట్‌ని ఫాలో అవుతున్నారు నితిన్ అండ్ టీమ్. నితిన్ (Nithiin) హీరోగా, శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమా మార్చి 28న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన మీడియా సమావేశంలో నితిన్ మాటలు ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే.
Also Read- Jack: కిస్ సాంగ్ ప్రోమో.. ఒక్కసారి కమిట్ అయ్యానంటే లైఫ్ అంతా ఉండిపోతా!
అంతకు ముందు కేతికా శర్మ (Ketika Sharma) స్పెషల్ సాంగ్ చేసిన ‘అది ధా సర్‌ప్రైజ్’ పాట ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఆ పాటలో ఆమె చేసిన స్టెప్ ఒకటి కాంట్రవర్సీగా మారి, ఈ సినిమాను వార్తలలో పెట్టేసింది. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఏం చేయాలా? అని నితిన్, దర్శకుడు వెంకీ తెగ ఆలోచించేస్తున్నారు. గ్రౌండ్ లెవల్‌లోకి సినిమాను తీసుకెళ్లాలి. ఇందుకు ఏం చేయాలి? అని హీరో, దర్శకుడు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో తెలిసేలా నితిన్ ఓ వీడియోను తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో..
చాట్ జీపీటీ ఆన్ చేసి.. ‘హౌ టు ప్రమోట్ ఆన్‌లైన్’ అని టైప్ చేస్తుండగా, అప్పుడే వచ్చిన దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) ‘వెరీ నైస్.. సినిమా కూడా ఆన్‌లైన్‌లోనే చూస్తారు.. మీకు ఓకేనా?’ అని అడగగా ఒక్కసారిగా హీరో నితిన్ షాకయ్యారు. ‘అదేంటి?.. ఏం చేద్దాం మరి?’ అని వెంకీని నితిన్ ప్రశ్నించాడు. ‘గ్రౌండ్ ప్రమోషన్స్ కూడా చేయాలన్నా..’ అని పక్కనున్న నితిన్‌ని వెంకీ చూస్తే.. నితిన్ మాయమయ్యాడు. ఎదురుగా నిలబడి.. ‘వెంకీ.. ఏంటి లేట్.. వెళ్దాం పద..’ అంటూ ప్రమోషన్స్‌కి పరుగులు తీస్తున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం నితిన్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.
HAPPY HOLI TO U ALL🤗🤗
We are coming to meet you. I’m excited!
15th March
Rajahmundry – ISTS College | Bhimavaram – SRKR Engineering College16th March
Vijayawada – PVP Mall#Robinhood GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th. pic.twitter.com/QaScsuoevj— nithiin (@actor_nithiin) March 14, 2025
ఈ మధ్యకాలంలో విడుదలరోజే సినిమాల ఒరిజినల్ ప్రింట్స్ బయటికి వచ్చేస్తున్నాయి. ఈ పైరసీ గురించి ఆలోచించకుండా, కష్టపడకుండా చాట్ జీపీటీలంటూ కూర్చుంటే కుదరదు. అయినా, ఆన్‌లైన్ అని ముందే ప్రేక్షకులకు హింట్ ఇచ్చినట్లుగా ఈ వీడియో ఉంది. ప్రమోషన్స్ చేయాలి కానీ, అవి సినిమాకు ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ఆ విషయం నితిన్‌కు వెంకీ అయినా అర్థమయ్యేలా చెప్పాడో లేదో?. ఇక నితిన్ పోస్ట్ చేసిన వీడియోలో ‘ఆన్‌లైన్’ అని ఉన్నప్పటికీ గ్రౌండ్‌లోకి దిగడానికి ప్రోమోలా వారు ఈ వీడియోను విడుదల చేశారు.
‘రాబిన్‌హుడ్’ టీమ్ మార్చి 15న రాజమండ్రిలోని ఐఎస్‌టిఎస్ కాలేజ్‌లోనూ, అదే రోజు భీమవరంలోని ఎస్ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కాలేజ్‌లోనూ సినిమాను ప్రమోట్ చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే, మార్చి 16న విజయవాడ పివిపి మాల్‌లో టీమ్ అంతా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ సందడి చేయనుంది. అది ధా మ్యాటర్. నట కిరీటీ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
Puri Jagan – Charmy: పూరి జగన్ – ఛార్మీల మధ్య ఏం జరిగింది? వారిద్దరూ నిజంగా విడిపోయారా?