Manyam Dheerudu OTT: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) ‘ఆర్ఆర్ఆర్’ (RRR సినిమాలో సీతారామరాజుగా కనిపించిన క్లైమాక్స్ సీన్‌కు ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఇప్పటికీ రామ్ చరణ్ ఆ అవతార్‌లో ఉన్న ఫొటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ సినిమా తర్వాత అదే తరహా పాత్రతో పూర్తి సినిమా తీయాలనేంత స్ఫూర్తిని ఆర్ఆర్ఆర్ సినిమా కల్పించింది. ఆర్‌వివి మూవీస్ బ్యానర్ పై ఆర్‌వివి సత్యనారాయణ ప్రధాన పాత్రలో ‘మన్యం ధీరుడు’ టైటిల్‌తో ఆ ప్రయత్నం చేశారు కూడా. 2024లో థియేటర్లలోకి వచ్చి మంచి స్పందనను రాబట్టుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘మన్యం ధీరుడు’ చిత్రం విడుదలై, మంచి ఆదరణను రాబట్టుకుంటున్నట్లుగా చిత్ర టీమ్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
Also Read- Prakash Raj: మరోసారి పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్.. నెటిజన్ల రియాక్షన్ చూశారా!
ఈ సినిమా ఓటీటీ విడుదలను పురస్కరించుకుని చిత్ర టీమ్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వివి రమణమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయయారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అతి త్వరలో సినీ హబ్‌గా విశాఖను మారుస్తాం. దీనిపై ఇప్పటికే కమిటీలు వేశామన్నారు. రవీంద్ర భారతి తరహాలో శంకుస్థాపనలు కూడా చేశామని తెలిపారు. అతి త్వరలోనే దీన్ని పూర్తి చేసి విశాఖ ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తామని చెప్పారు. ‘మన్యం ధీరుడు’ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర చేసిన ఆర్‌వివి సత్యనారాయణను ఆయన ఎంతగానో కొనియాడారు. ఇలాంటి చిత్రాలు ప్రస్తుత జనరేషన్‌కు ఎంతైనా ఉపయోగకరమని, ఇది కచ్చితంగా చూడదగిన సినిమాగా ఆయన చెప్పుకొచ్చారు.
అనంతరం చిత్ర నిర్మాత, హీరో అయినటువంటి ఆర్‌వివి సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘మన్యం ధీరుడు’ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. కత్తి యుద్ధం, విలువిద్యలలో శిక్షణ తీసుకున్నాను. అల్లూరి సీతారామరాజు చేసిన విరోచిత పోరాటం ప్రేక్షకులకు తెలియజేయాలనే ఈ ప్రయత్నం చేశాను. ఈ చిత్రాన్ని ఎస్‌కేఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేశాము. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ఓటీటి ప్లాట్ ఫామ్‌లో కూడా అందుబాటులోకి తెచ్చాం. అందరూ ఈ సినిమాను చూడాలని కోరారు. ఈ సినిమాను నిర్మించినందుకు, అలాగే ఇందులో నటించినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమానికి విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, డైరెక్టర్ యాద కుమార్, జి ఎస్ ఎన్ రాజు తదితరులు హాజరయ్యారు..
‘మన్యం ధీరుడు’ కథ విషయానికి వస్తే.. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి, వారి తుపాకీ గుళ్లకు బలైన అల్లూరి సీతారామరాజు కథ ఇది. రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్‌వివి సత్యనారాయణ పోషించారు. ప్రజలు వారికి ఉన్న భూమిలో దుక్కి దున్నుకుని, పంట పండించుకుంటుంటే, దానికి పన్నులు వేసి.. బలవంతంగా వసూళ్లను చేయడాన్ని అల్లూరి సీతారామరాజు వ్యతిరేకిస్తారు. అందుకు బ్రిటీష్ వారు ఎలా రియాక్ట్ అయ్యారు? సీతారామరాజును బంధించాలని చూసిన బ్రిటీష్ వాళ్లను, ఆయన ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి, ప్రజల తరఫున నిలబడ్డాడు? స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజలను ఎలా సిద్ధ చేశాడు? మన్యంలోని పేద ప్రజల్లో ఎలా చైతన్యం తీసుకువచ్చి, వారిలో మార్పుకు కారణమయ్యాడు? వంటి విషయాలను కళ్లకు కట్టినట్లుగా చెప్పేదే ఈ ‘మన్యం ధీరుడు’ మూవీ.
ఇవి కూడా చదవండి:
Sivaji: ‘యానిమల్’లోని బాబీ డియోల్ కంటే బాగా చేశానని రాశారు.. చాలా హ్యాపీగా ఉంది
Chiranjeevi: ఎమ్మెల్సీ నాగబాబుకు అన్నయ్య చిరు దిశా నిర్దేశం!