Crime News: కాలు నరం తెగింది అంటూ ఆసుపత్రికి వెళ్తే తలకు ఆపరేషన్ చేసి ప్రాణాలు తీసిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఎరకారం గ్రామం,సూర్యాపేటకు చెందిన కుర్ర పరమేష్ (26) హయత్ నగర్, హైదారాబాద్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వ తేదిన బహదూర్పల్లిలోని ఒక ఇంట్లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ లో ఇంటి సామాన్ తరలించేందుకు పనికి వెళ్ళాడు. సామాను షిఫ్ట్ చేస్తున్న క్రమంలో రేకు లాంటి వస్తువు పరమేశ్ కాలికి తగిలి నరం తెగి రక్త స్రావం అవడంతో, గమనించిన తోటి పని వారు దగ్గర్లో ఉన్న బహదూర్పల్లి లోని sv సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచ్చారు.
ఆసుపత్రి నిర్లక్ష్యం
రెండు రోజులు చికిత్స చేసిన ఆసుపత్రి యాజమాన్యం, బాధితుడు కోలుకున్నాడని రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారనీ. నాలుగు రోజులు గడిచినా పరమేశ్ ను డిశ్చార్జ్ చేయట్లేదని అడగగా పరమేష్ తలలో రక్తం గడ్డ కట్టింది ఆపరేషన్ చేశామని, అతని పరిస్తితి సీరియస్‌గా ఉందంటూ చల్లగా వైద్యులు బదులిచ్చారు. కాలికి గాయంతో ఆసుపత్రికి వెళ్తే, తలకు ఆపరేషన్ చేయడం ఏంటని అడిగితే సమాధానం దాటవేశారనీ బాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. తీరా పరమేశ్ బ్రతికే ఛాన్స్ తక్కువని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు పరమేశ్ మరణించాడని చెప్పడంతో శోక సంద్రంలో కుటుంబీకులు మునిగిపోయారు.
Also Read: Hydra: బడా బాబులకు బిగ్ షాక్.. ఆక్రమణలకు పాల్పడితే ఆస్తులు జప్తు!
ఎఫ్ ఐ ఆర్ చేయకుండా ఉచిత సలహా ఇచ్చిన పోలీసులు
న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా ప్యాకర్స్ అండ్ మూవెర్స్ వాళ్లపై ఫిర్యాదు ఇవ్వండి, అందులో ఆసుపత్రి వైద్యుల తప్పు లేదంటూ ఉచిత సలహాలు ఇచ్చి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బులు డిమాండ్
కానిస్టేబులు డబ్బులు డిమాండ్ చేశాడని, 4వేల రూపాయలు ఇచ్చెద్దాక కూడా మృతదేహాన్ని తమకు ఇవ్వలేదని, ఎటువంటి పంచనామా కాపీ మాకు ఇవ్వలేదని, రెండు మూడు రోజుల తర్వాత ఇస్తామని, మృతదేహాన్ని తీసుకు వెళ్ళమని తెలపడంతో సూర్యాపేటకు తీసుకు వెళ్తున్నామని బాధితులు వాపోయారు.
Also Read: CPI Narayana: యుద్ధం పాకిస్తాన్ టెర్రరిజంపైనే.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు!