Jeedimetla Murder Case (imagecredit:twitter)
క్రైమ్

Jeedimetla Murder Case: తల్లిని చంపింది అందుకే.. వెలుగులోకి సంచలన నిజాలు

Jeedimetla Murder Case: ప్రేమ వ్యవహారంలో అడ్డు రావటమే కాకుండా తీవ్రంగా హింసిస్తున్న తల్లి పట్ల ద్వేషం పెంచుకున్న బాలిక (15) తన ప్రేమికుడు అయినా శివ(19), అతని తమ్ముడు(16)తో కలిసి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో హత్య చేయించింది. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లను హోంకు తరలించగా శివని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలానగర్ డిసిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిసిపి సురేష్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

ముందు ఒప్పుకొని.. తరువాత..

షాపూర్ నగర్ న్యూ ఎల్బీనగర్‌(Shapur Nagar)లో నివాసం ఉంటున్న అంజలి(Anjali)(39)కి ఇద్దరు కూతుర్లు. వీరు స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల(Govt School)లో చదువుతున్నారు. పదవ తరగతి చదువుతున్న బాలిక (15) కు ఇంస్ట్రా గ్రామ్‌(Instagram)లో శివ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారడం, ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడం జరిగింది. అనంతరం శివ(Shiva) మృతురాలి అంజలి ఇంటికి తరచుగా వచ్చి వెళ్తున్నాడు. వీరి ప్రేమను అంజలి ముందుగా ఒప్పుకొని తర్వాత ఆక్షేపించింది. అయినప్పటికీ వీరి ప్రేమ విహారం కొనసాగుతూ వస్తుండటంతో పలుమార్లు అంజలి బాలికను తీవ్రంగా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.

Also Read: Kuberaa: కుబేర సినిమాలో రష్మిక డబ్బు బ్యాగ్ ఎక్కడ ఉంది? శేఖర్ కమ్ముల సమాధానం చెప్పాల్సిందే?

హింసిస్తుందని కక్ష గట్టి..

అంజలి మొదటి భర్తకు ఒకరు, రెండో భర్తకు ఒకరు ఇద్దరు ఆడపిల్లలు. వీరిలో మొదటి భర్తకు పుట్టిన బాలిక కన్నా రెండో భర్త ద్వారా పుట్టిన తన చెల్లిని ప్రేమగా చూసుకుంటుందని మదనపడుతూ వస్తుండేది. బాలిక తరచుగా బాలికను కొట్టడం తిట్టడం వంటివి చేస్తూ ఉండటంతో మూడు సంవత్సరాల క్రితం బాలిక ఏడవ తరగతి చదువుతున్న సందర్భంలో పోలీస్ స్టేషన్‌(Police Station)కు వచ్చి తల్లి అంజలిపై ఫిర్యాదు చేసింది. అనంతరం బాలిక అంజలి వద్దనే ఉన్నది. అయినప్పటికీ వివిధ సందర్భాలలో బాలికను హింసించడం జరుగుతూ రావడం ఎనిమిది నెలలుగా వీరి ప్రేమ వ్యవహారం విషయంలో ముందుగా ఒప్పుకొని తర్వాత ఒప్పుకోకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో బాలిక తల్లి అంజలి పై కక్ష పెంచుకుంది.

చంపేయాలని ఒత్తిడి

ఈనెల రెండో వారంలో బాలిక, తన చెల్లెలు శివ ఇంటిలో నాలుగు రోజులు ఉన్నారు. తల్లి అంజలి బలవంతం మీద బాలిక ఇంటికి వచ్చింది. ఈనెల 18న రాత్రి సమయంలో బాలిక ఇంటిలోఉన్న కొంత నగదు, బంగారాన్ని తీసుకొని శివతో వెళ్లిపోయింది. 19న అంజలి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 20న బాలికను తీసుకొని వచ్చి తల్లి అంజలికి అప్పగించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు(Medical Test) నిర్వహించి శివని కోర్టులో హాజరపరచడం చేయాల్సి ఉన్నది. అయితే ఇంతలోనే బాలిక తన ప్రేమికుడైన శివతో తన తల్లిని చంపేయాలంటూ వత్తిడి తీసుకొచ్చింది. ముందు శివ ఒప్పుకోకపోవడంతో తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో శివ తన తమ్ముడి (16)తో కలిసి వచ్చి అంజలిని హత్య చేశాడు. ఈ ఘటనలో పోలీసులు శివను అరెస్టు చేశారు. కాగా శివ ప్రస్తుతము ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతూ డీజే(DJ) ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

Also Read: Meenakshi Natarajan: పార్టీని మరింత పటిష్టం చేయాలి.. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ స్పష్టం!

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు