Meenakshi Natarajan: పార్టీని మరింత పటిష్టం చేయాలి..
Meenakshi Natarajan(image credit: twitter)
Political News

Meenakshi Natarajan: పార్టీని మరింత పటిష్టం చేయాలి.. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ స్పష్టం!

Meenakshi Natarajan: పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా అవకాశాలు లభిస్తాయని ఏఐసీసీ (AICC) ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)స్పష్టం చేశారు.(Gandhi Bhavan) గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ (PCC) కార్యవర్గ, పీఏసీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ.. పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, తాను స్వయంగా క్షేత్రస్థాయిలో సమీక్షిస్తానని చెప్పారు. ఇప్పటికే పదవులు పొందిన వారు తమ పనితీరుపై దృష్టి సారించాలని మీనాక్షి (Meenakshi Natarajan) సూచించారు. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. సరిగా పనిచేయని వారి జాబితాను కూడా పార్టీ నాయకులు తనకు అందజేయాలని మీనాక్షి సూచించారు. రాబోయే రోజుల్లో మరికొందరికి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు లభిస్తాయని ఆమె హామీ ఇచ్చారు.

 Also ReadIndiramma Houses: లక్షకు పైగా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్.. మంత్రి వెల్లడి!

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పాలన..
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మాట్లాడుతూ.. రాష్ట్రంలో అద్భుతమైన ప్రజా పాలన సాగుతుందని అన్నారు. ఏఐసీసీ (AICC) ఇస్తున్న సూచనల మేరకు పనిచేస్తూ, దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా పాలన అందిస్తున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, (Revanth Reddy) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, (Bhatti Vikramarka) ఇతర మంత్రివర్గ సభ్యులు అద్భుతమైన ఆలోచనలతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏఐసీసీ (AICC) ఇచ్చిన ‘జై బాపు, జై భీమ్ సంవిధాన్’, సంస్థాగత నిర్మాణం తదితర కార్యక్రమాలు రాష్ట్రంలో సంపూర్ణంగా అమలవుతున్నాయన్నారు.

పథకాలను, విస్తృతంగా ప్రచారం చేయాలి

రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలని, అందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. గ్రామాలలో (Government schemes) ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రైతు భరోసా (Farmer Assurance) ఒక మంచి కార్యక్రమమని, గతంలో ఎన్నడూ లేని విధంగా 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతులకు ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. తెలంగాణ గురించి దేశమంతా చర్చించుకుంటుందని, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉన్నాయని ఏఐసీసీ నాయకులు కూడా అభినందిస్తున్నట్లు పీసీసీ (PCC) చీఫ్ తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ (AICC) కార్యదర్శి విశ్వనాథన్, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర్ రాజనర్సింహ, వంశీ కృష్ణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 Also Read: CM Revanth Reddy: కల్వకుంట్ల ఫ్యామిలీకి వేల కోట్లు ఎక్కడివి?.. సీఎం సంచలన కామెంట్స్!

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం