Hyderabad News (imagecredit:canva)
క్రైమ్

Hyderabad News: ఇదెక్కడి విడ్డూరం.. పర్ఫ్యూమ్ కోసం కాల్పులు.. అసలేం జరిగిందంటే?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad News: చిన్న విషయమై తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి కాల్పులకు దారి తీసింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన గుడిమల్కాపూర్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఇక వివరాలలోకి వులితే ఇలా ఉన్నాయి. రంజాన్​ పండుగను పురస్కరించుకుని గుడిమల్కాపూర్​ లోని కింగ్స్​ ప్యాలెస్​ ఫంక్షన్​ హాల్​ లో దావత్​ ఏ రంజాన్​ ఎక్స్​ పో నడుస్తోంది. ఎక్స్​ పోలో భాగంగా నిర్వాహకులు అహమద్​ పర్ఫ్యూం స్టాల్​ ను ఏర్పాటు చేశారు. దీంట్లో యూఏఈకి చెందిన ఖల్సేకర్​ తౌఫిక్​, అజీజ్​ షేక్​, మోయిజ్​ అహమద్​ లు సేల్స్​ మెన్లుగా పని చేస్తున్నారు.

ఇదిలా ఉండగా శనివారం ఉదయం 8.15 గంటల సమయంలో ఏసీ గార్డ్స్​ నివాసి మహ్మద్​ ఫర్ఖాన్​ అహమద్​ పర్ఫ్యూం బాటిల్లు కొనటానికి ఎక్స్​ పోకు వచ్చాడు. అప్పటికే తౌఫిక్​, అజీజ్​ షేక్​, మోయిజ్​ లు సామాన్లన్నీ ప్యాక్​ చేసి అక్కడి నుంచి వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో షాపు మూసివేశామని, పర్ఫ్యూం సీసాలు ఇవ్వలేమని ఫర్ఖాన్​ కు చెప్పారు. దాంతో కోపంతో రెచ్చిపోయిన ఫర్ఖాన్​ వారిని అసభ్యకర పదజాలంతో దూషించటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులకు ఫోన్లు చేశాడు.

Also Read: Banjara Hills police: ఇదేం పైత్యం.. రీల్స్ కోసం గన్ తో ఓపెన్ టాప్ జీపు ఎక్కి..

ఈ క్రమంలో ఫర్ఖాన్​ స్నేహితులు పది మంది అక్కడికి చేరుకున్నారు. స్టాల్ నిర్వాహకులతో గొడవ పెట్టుకున్నారు. దాంతో స్టాల్​ నిర్వాహకుడు ఎక్స్​ పో ఆర్గనైజర్​ కు ఫోన్​ చేసి విషయం తెలిపాడు. ఈ క్రమంలో ఆర్గనైజర్​ సోదరుడు, పారామౌంట్​ గార్డెన్​ అపార్ట్​ మెంట్​ నివాసి హసీబుద్దీన్​ హైదర్​ తన మేనల్లుడు రియాసత్​ తో కలిసి అక్కడికి వచ్చాడు. మాట్లాడుతుండగానే ఫర్ఖాన్​ అతని స్నేహితులు రియాసత్​ పై దాడి చేసి కొట్టారు. అడ్డుకోవటానికి ప్రయత్నించిన వలంటీర్​ ఖైసర్​ ను పక్కకు నెట్టేశారు.

దాంతో హసీబుద్దీన్​ తన వద్ద ఉన్న లైసెన్సడ్​ రివాల్వర్​ తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు ఫర్ఖాన్​ అతని స్నేహితులతోపాటు హసీబుద్దీన్​, రియాసత్​ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. హసీబుద్దీన్​ వద్ద ఉన్న రివాల్వర్​ ను నోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Nizamabad Crime: తల్లి కోసమే హత్య? కారు డిక్కీ డెడ్ బాడీ కేసులో సంచలన నిజాలు..

 

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం