Hyderabad Crime: ప్రస్తుత రోజుల్లో పిల్లల ఆలోచన శక్తి ఎవరికీ అంతుపట్టడం లేదు. చిన్న చిన్న సమస్యలకే వారు కుంగిపోతున్నారు. పరీక్షల్లో ఫెయిలైనా.. అడిగినది తల్లిదండ్రులు ఇవ్వకపోయినా వెంటనే నొచ్చుకుంటున్నారు. సూసైడ్స్ వరకూ వెళ్తూ తల్లిదండ్రును తీరని దుఖంలోకి నెట్టేస్తున్నారు. ఈ తరహా ఘటనే తాజాగా హైదరాబాద్ లో జరిగింది. వీడియో గేమ్స్ ఆడొద్దని మందలించినందుకు ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ సైదాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే ఆ బాలుడు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ తల్లిదండ్రులు నచ్చజెప్పారు. సప్లిమెంటరీ బాగా రాసి పాస్ కావొచ్చని బాలుడికి ధైర్యం చెప్పారు.
గేమ్స్ ఆడుతున్నాడని మందలింపు
అయితే సప్లిమెంటరీకి ప్రిపేర్ అవ్వాల్సిన బాలుడు.. అది వదిలేసి నిత్యం మెుబైల్ తో గడపడం ప్రారంభించాడు. ఫోన్ లో అదే పనిగా గేమ్స్ ఆడుతున్నాడు. ఇది గమనించిన తల్లి.. ఆ 16 ఏళ్ల బాలుడ్ని మందలించింది. గేమ్స్ ఆడొద్దని సూచించింది. బుద్ధిగా చదువుకొని సప్లిమెంటరీలో మంచి మార్కులు సాధించాలని సూచించింది.
బిల్డింగ్‌పైకి వెళ్లి ఆత్మహత్య
అయితే తల్లి మందలించడాన్ని బాలుడు తట్టుకోలేకపోయాడు. దానిని అవమానంగా ఫీలయ్యాడు. తీవ్ర మనస్థాపంతో బిల్డింగ్ పైకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఎంతకి బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పైకి వెళ్లి చూడగా బాలుడు విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Banoth Madanlal: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ఆలోచనల్లో మార్పులు
తల్లి తిట్టిందని, మార్క్స్ రాలేదని పిల్లలు సూసైడ్ చేసుకోవడం గతంతో పోలిస్తే ఇటీవల రోజుల్లో బాగా ఎక్కువైంది. ఇది చిన్నారుల ఆలోచన విధానాన్ని సూచిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ జనరేషన్ పిల్లల్లో వారిపై వారికి నమ్మకం ఉండటం లేదని అంటున్నారు. ఆత్మన్యూనత భావంతో ఎక్కువ మంది చిన్నారులు ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే మానసిక నిపుణులను తల్లిదండ్రులు సంప్రదించాలని సూచిస్తున్నారు.