Gadwal District: భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపం చెందిన భర్త బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో (Gadwal District) చోటుచేసుకుంది. గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ రెండవ ఎస్సై సతీష్ రెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణం వడ్డేవీదికి చెందిన రాధ వివాహం రాయచూర్ జిల్లాకు చెందిన వడ్డే రాజుతో అయిదేండ్ల క్రితం జరిగింది.
Also Read: Gadwal District: డేంజర్ బెల్స్.. గద్వాల జిల్లాలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. ఇవిగో లెక్కలు..?
భార్యభర్తల మధ్య మనస్పర్థలు
వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా వడ్డే రాజు మద్యానికి బానిసకవడంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 6 నెలల కిందట భార్య రాధ భర్తతో గొడవ పడి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది. మద్యానికి బానిసైన వడ్డే రాజు తరుచు గద్వాలలోని భార్య ఇంటికి వెళ్లి కొట్లాడేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గద్వాలలోని భార్య ఇంటి ముందు వడ్డేరాజు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడాడు.
కేసు నమోదు చేసి దర్యాప్తు
దాంతో తీవ్ర రక్తస్రావం కాగా స్థానికులు గాయపడిన వడ్డే రాజును గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వడ్డే రాజుకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం వడ్డేరాజు పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కు తరలిస్తున్నట్లు ఆర్ఎంఓ మాలకొండయ్య, డాక్టర్ భావన తెలిపారు. ఈ సంఘటనపై గద్వాల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

