Guntur district Murder: కొందరు భార్యలు తమ భర్తను అతి కిరాతకంగా హత్య చేస్తున్న ఘటనలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. అతి కిరాతకంగా కట్టుకున్న వాడ్ని కాటికి చేరుస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. భర్తను చంపిన అనంతరం.. ఆయన శవం పక్కన కూర్చొని.. అశ్లీల వీడియోలు చూడటం సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉల్లిపాయల వ్యాపారి శివ నాగరాజును భార్య లక్ష్మీ మాధురి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరికి 2007లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మాధురి విజయవాడలో పనిచేస్తున్న క్రమంలో గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
బిర్యానీలో 20 నిద్రమాత్రలు..
తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త శివ నాగరాజును ఎలాగైనా అడ్డుతప్పించాలని భార్య మాధురి స్కెచ్ వేసింది. ప్రియుడు గోపితో కలిసి ఓ కుట్రకు శ్రీకారం చుట్టింది. ప్లాన్ ప్రకారం జనవరి 18 రాత్రి భర్త కోసం బిర్యానీ వండిన మాధురి.. అందులో ఏకంగా 20 నిద్ర మాత్రల పొడిని కలిపింది. దానిని భర్తకు ఎంతో ప్రేమగా వడ్డించింది. అది తిన్న శివ నాగరాజు గాఢమైన నిద్రలోకి జారుకున్నాడు. దీంతో గోపిని ఇంట్లోకి రప్పించిన మాధురి.. అతడి సాయంతో భర్త ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా జేసింది. శివరామరాజు ఛాతిపై గోపి కూర్చొగా.. మాధురి దిండుతో గట్టిగా భర్త ముఖాన్ని అదిమింది. దీంతో ఊపిరి ఆడక భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో దారుణం
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు పెట్టిన భార్య మాధురి
భర్త శివనాగరాజు నిద్రపోయిన తర్వాత ప్రియుడితో కలిసి ముఖంపై దిండుతో ఊపిరాడకుండా చేసి చంపిన భార్య
చంపిన తర్వాత రాత్రంతా… pic.twitter.com/qD5VcLba4U
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2026
Also Read: Karate Kalyani: లక్కీ డ్రా దందాను అడ్డుకున్న కరాటే కళ్యాణిపై నిర్వాహకులు దాడి.. పలువురిపై కేసు
రాత్రంతా పోర్న్ వీడియోలు..
భర్తను చంపిన అనంతరం భార్య మాధురి తన సైకో తనాన్ని మరింత బయటపెట్టింది. హత్య అనంతరం ప్రియుడు బయటకు వెళ్లిపోగానే.. భర్త శవం పక్కన కూర్చొని సెల్ ఫోన్ లో రాత్రంగా అశ్లీల వీడియోలు చూస్తూ ఉండిపోయింది. తెల్లవారిన అనంతరం మరో కుట్రకు మాధురి తెరలేపింది. తన భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ బంధువులు, ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. తొలుత ఆమె మాటలు నమ్మిన బంధువులు, స్నేహితులు.. శివ నాగరాజు అంత్యక్రియలకు ఏర్పాట్లు సైతం చేశారు. ఈ క్రమంలో నాగరాజు చెవి వద్ద రక్తం కారి ఉండటాన్ని చూసి అనుమానపడ్డారు. వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి.. తమదైన శైలిలో మాధురిని విచారణ చేశారు. దీంతో తన భర్తను ప్రియుడు గోపితో కలిసి తానే హత్య చేసినట్లు మాధురి అంగీకరించింది.

