Bus Accident: కర్నూల్ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం
Bus Accident (imagecredit:twitter)
ఆంధ్రప్రదేశ్, క్రైమ్

Bus Accident: కర్నూల్ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని ముగ్గురు సజీవ దహణం..!

Bus Accident: కర్నూల్ టు చిత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరివెళ్ల మెట్ట వద్ద గ్యాస్ గౌడ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సు నెంబర్ ARBCVR NL 02 B 4647 నెంబరుగల బస్సు నెల్లూరు(Nelluru) నుంచి హైదరాబాద్‌(Hyderabad)కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెల్తుడగా ప్రమాదానికి గురైంది. ప్రయాదం జరిగిన బస్సులో దాదాపుగా మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. రన్నింగ్‌లో బస్సు టైర్ పేలడంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా ఉన్నటువంటి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కంటైనర్‌ని బస్సు బలంగా ఢీ కొట్టింది.

మంటల్లో చిక్కుకొని మృతి

ఆళ్లగడ్డ వైపు వెళ్తున్న ఓ మోటార్ సైకిల్ కంటైనర్ లారీని బస్సు ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే బస్సు, లారీకి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు ప్రమాద సమయంలో బస్సు మెయిన్ డోర్(Main door), ఎమర్జెన్సీ డోర్(Emergency door) ఓపెన్ కాలేదు. దీంతో ప్రయాణికులు ఓక్కసారిగా మంటల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాద స్ధలంలోని అక్కడి స్థానికులు వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీసి వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్(Driver), మరియు లారీ డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకోని కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. జైళ్ల శాఖలో ఇద్దరు అధికారులకు ప్రమోషన్లు

భారీగా ట్రాఫిక్ జామ్..

ప్రమాదంలో మరికొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రామాద అనంతరం సంఘటన స్థలానికి ఆళ్లగడ్డ డివిజన్ పోలీసులు చేరుకున్నారు. దీంతో వెంటనే గాయపడిన వారికి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకోని సంఘటన స్థలంలోని మంటలు అదుపులోకి తీసుకోచ్చారు. అప్పటికే బస్సు డ్రైవర్ మరియు లారీ డ్రైవర్, క్లీనర్ మటల్లో కాలిపోయిన సంఘటన అందరిని కలిచివేసింది. ఈ ప్రాదంతో కర్నూలు టూ చిత్తూరు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) అయింది. జరిగిన ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Also Read: Ind vs NZ 1st T20: తొలి టీ20లో టీమిండియా విధ్వంసం.. కివీస్‌ ముందు భారీ టార్గెట్!

Just In

01

Etela Rajender: మున్సిపోరుపై కమలం కసరత్తు.. రంగంలోకి ఎంపీ ఈటల!

BJP Telangana: మున్సిపోరుపై కమలం కసరత్తు.. ఉత్తర తెలంగాణపై ఫుల్ ఫోకస్!

Davos Summit: తెలంగాణ రైజింగ్ 2047కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్ధతు

GHMC Elections: గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

Illegal Admissions: ఇదెక్కడి విడ్డూరం.. 10వ తరగతి పూర్తవ్వకుండానే ఇంటర్ అడ్మిషన్లు!