Karate Kalyani: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న లక్కీ డ్రా దందాను అడ్డుకోవడానికి వెళ్లిన నటి కరాటే కళ్యాణిపై నిర్వాహకులు భౌతిక దాడికి తెగడడ్డారు. పంజాగుట్ట పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది. కోట్ల రూపాయల లక్కీ డ్రా స్కామ్ ఆదిభట్ల వండర్లా సమీపంలో సిద్ధమౌని నరేందర్ అనే వ్యక్తి ‘ఫార్చునర్ కారు’ భారీ బహుమతులను ఎరగా చూపి, లక్కీ డ్రా పేరుతో ప్రజల నుండి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ మోసంపై సమాచారం అందుకున్న కరాటే కళ్యాణి, పంజాగుట్ట పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుని నిర్వాహకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కళ్యాణి అక్కడ జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తుండగా, నిర్వాహకుడు నరేందర్ అతని పది మంది అనుచరులు కరాటే కళ్యాణిపై దాడికి తెగబడ్డారు.
Read also-Happy Raj: జీవీ ప్రకాష్ ‘హ్యాపీ రాజ్’ ప్రోమో చూశారా.. అబ్బాస్ రీ ఎంట్రీ అదుర్స్
పంజాగుట్ట పోలీసులు వారించే ప్రయత్నం చేసినప్పటికీ, నిందితులు కళ్యాణిపై దాడికి దిగారు. ఆమె చున్నీ లాగి, అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ప్రైవేట్ భాగాలను తాకడానికి ప్రయత్నించారని కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘రేప్ చేస్తాం’ అని, ప్రాణాలతో వదలబోమని బహిరంగంగా బెదిరించినట్లు తెలుస్తోంది. నమోదైన కేసులు నిందితులపై బిగిస్తున్న ఉచ్చు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆదిభట్ల పోలీసులు కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత కింద కఠిన సెక్షన్లు నమోదు చేశారు.
Read also-Ustaad BhagatSingh: పవన్ కోసం తన కలానికి మరింత పదును పెడుతున్న చంద్రబోస్.. ఇది వేరే లెవెల్..
ఈ కేసులో ప్రధాన నిందితుడైన సిద్ధమౌని నరేందర్ ఒక పాత నేరస్థుడని సమాచారం. గతంలో ఇతనిపై మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్, లక్కీ డ్రా మాటున ఇతను అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను, సెల్ ఫోన్ వీడియోలను పరిశీలిస్తున్నారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ లక్కీ డ్రా వెనుక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మహిళల భద్రత అక్రమ లక్కీ డ్రా దందాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

