Crime News: తెలంగాణలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా నిర్వహించిన దాడుల్లో ఇద్దరు వేర్వేరు గంజాయి పెడ్లర్లను అరెస్ట్ చేసి, వారి నుంచి మొత్తం 14.75 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఎల్బీనగర్ వద్ద అరెస్ట్..
పక్కా సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ఎల్బీనగర్ సర్కిల్ వద్ద గంజాయి పొట్లాలు అమ్ముతున్న కట్ట గణేశ్ (జగిత్యాల వాస్తవ్యుడు)ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 7.75 కిలోల గంజాయిని సీజ్ చేసి, మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Golkonda Kidnap Case: నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం.. 24 గంటల్లో మిస్టరీని ఛేదించిన పోలీసులు
హఫీజ్‌పేటలో మరో దాడి..
మరోవైపు, హఫీజ్‌పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న ఆదిత్యనగర్‌లో గంజాయి అమ్ముతున్న నెల్లూరు జిల్లా వాస్తవ్యులు నితీశ్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్‌ను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ డీ టీం సీఐ నాగరాజు సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి నిందితుల నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు నిందితుల నుంచి బైక్, మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం శేరిలింగంపల్లి పోలీసులకు అప్పగించారు.
Also Read: Harish Rao: ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు..?

