Eagle Team: గంజాయికి బానిసలై ఈగల్ టీం కు చిక్కిన 11 మంది..!
Eagle Team (imagecredit:swetcha)
క్రైమ్

Eagle Team: గంజాయికి బానిసలుగా మారి.. ఈగల్ టీం కు చిక్కిన 11 మంది..!

Eagle Team: గంజాయికి అలవాటు పడ్డ 11మందిని ఈగల్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి డీ అడిక్షన్​ సెంటర్​ కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల నమోదు చేసిన ఓ గంజాయి కేసులో వెల్లడైన వివరాల మేరకు ఈగల్​ టీం అధికారులు అజహర్​ (26), హరిప్రసాద్​ (24), మహేశ్​ (29), కైలాశ్​ నాథ్​ (25), శ్రవణ్​ కుమార్ (34), తేజస్వీ రాజ్​ సింగ్ (36), అజహరుద్దీన్ (30), అమన్​ (24), ఆద్నాన్​ అహమద్​ (21), సాహిత్ (25), సాయికిరణ్​ (26)లను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్​ డిటెక్షన్​ కిట్​ లతో వీరికి పరీక్షలు జరుపగా అందరూ గంజాయికి అలవాటు పడ్డారని నిర్ధారణ అయ్యింది. దాంతో వారి తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు వారి ఎదుటే అదుపులోకి తీసుకున్న అందరికీ గంజాయి సేవించటం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించారు. అనంతరం 11మందిని డీ అడిక్షన్​ సెంటర్​ కు తరలించారు. గంజాయి అలవాటు నుంచి బయట పడ్డారని నిర్ధారణ అయిన తరువాత వీరిని డీ అడిక్షన్​ సెంటర్​ నుంచి బయటకు తెస్తామని అధికారులు తెలిపారు.

Also Read: TG Global Summit: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లోని పూర్తి అంశాలు.. ప్రణాలికలు ఇవే..!

ప్రాణాలు పోతున్నాయ్​..

మాదక ద్రవ్యాల మత్తు నిండు ప్రాణాలను బలి తీసుకుంటోందని ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిల్య చెప్పారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ దందాను అరికట్టటానికి విస్తృత చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అదే సమయంలో మాదక ద్రవ్యాలకు అలవాడు పడ్డ వారిని ఆ వలయం నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇటీవల చాంద్రాయణగుట్టలో ఇద్దరు యువకులు మత్తు కోసం ఇంజక్షన్​ తీసుకుని చనిపోయిన ఉదంతాన్ని గుర్తు చేశారు. అంతకు ముందు బాలాపూర్​ లో 17ఏళ్ల విద్యార్థి ఇలాగే మత్తు కోసం పెయిన్​ కిల్లర్ ఇంజక్షన్ తీసుకుని ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. రాజేంద్రనగర్​ లో ఓ 26ఏళ్ల యువకుడు కూడా డ్రగ్స్​ బారిన పడి చనిపోయాడన్నారు. అతని స్నేహితుడు చావు వరకు వెళ్లి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయట పడినట్టు చెప్పారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై కూడా దృష్టి సారించినట్టు చెప్పారు. ఎక్కడ మాదక ద్రవ్యాల దందా…వినియోగం జరిగినా 1908 నెంబర్​ కు సమాచారం అందించాలని కోరారు. 87126 71111 నెంబర్​ కు వాట్సాప్ ద్వారా కూడా వివరాలు అంద చేయవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా పెడతామన్నారు.

Also Read: Visakhapatnam: విశాఖలో అగ్నిప్రమాదం.. 9వ అంతస్తులోని ఫ్లాట్‌లో ఎగసిపడ్డ మంటలు

Just In

01

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!