Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్డులోని ఫార్చ్యూన్ రెసిడెన్సీలో గల ఓ ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అపార్ట్ మెంట్ లోని 6వ అంతస్తులో గల ఫ్లాట్ నుంచి అగ్నికీలలు ఎగసిపడటంతో అపార్ట్ మెంటు వాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
వణికిపోయిన అపార్ట్ మెంట్ వాసులు
అంతకుముందు ఫ్లాట్ నుంచి దట్టమైన పొగ రావడాన్ని ఇరుగుపొరుగు వారు గుర్తించారు. వారు అలర్ట్ అయ్యే లోపే అస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో బెంబెలెత్తిపోయిన అపార్ట్ మెంట్ వాసులు.. మంటలు ఆర్పేందుకు తమ వంతు యత్నం చేయబోయారు. కానీ అవి అంతకంతకు విస్తరిస్తుండటంతో తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అపార్ట్ మెంట్ లోని వారంతా కిందకు వచ్చేశారు. మంటలు ఇతర ప్లాట్లకు విస్తరిస్తాయని కంగారు పడ్డారు.
VIDEO | Fire breaks out in an apartment on Beach Road in Vishakhapatnam. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/kZAfCt4LvJ
— Press Trust of India (@PTI_News) December 10, 2025
యుద్ధ ప్రాతిపదికన చర్యలు
ఈ క్రమంలోనే అపార్ట్మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మంటలు ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. అయితే అపార్ట్ మెంటులోని 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో.. వాటిని అదుపుచేయడం కష్టతరంగా మారింది. అయినప్పటికీ ఫైర్ సిబ్బంది తీవ్రంగా కష్టపడి చివరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
#WATCH | Andhra Pradesh | A fire broke out in an apartment located on the 9th floor of Radha Beach Residency on RK Beach Road in Visakhapatnam today. There were no casualties in the incident. Fire Department personnel have brought the fire under control pic.twitter.com/yD1P3KLQki
— ANI (@ANI) December 10, 2025
అందరూ క్షేమం
అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. అందరూ సురక్షితంగానే ఉన్నట్లు అపార్ట్ మెంట్ వాసులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై మాత్రం స్పష్టత రాలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అపార్ట్ మెంట్లలో జీవించే వారు.. అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Bigg Boss Telugu9: భరణి వల్ల సుమన్ శెట్టికి అన్యాయం!.. కళ్యాణ్ అదంతా కావాలనే చేశాడా?..
ఇటీవల కూడా ప్రమాదం..
కాగా, ఇటీవల విశాఖలోని కింజ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లోనూ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలోని కార్డియాలజీ డిపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగి అక్కడి టేబుళ్లు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. ఆస్పత్రిలోని డేటా ఎంట్రీ రూమ్ నుంచి తొలుత పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మంటలు భారీగా వ్యాపించడంతో కార్డియాలజీ విభాగం తీవ్రంగా దెబ్బతింది.

