Mastan Sai
Cinema, ఎంటర్‌టైన్మెంట్, క్రైమ్

Mastan Sai | మస్తాన్ సాయికి టాలీవుడ్‌తో లింక్?? రంగంలోకి నార్కోటిక్స్ పోలీసులు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మస్తాన్ సాయి (Mastan Sai) కేసు రోజుకో మలుపుతిరుగుతున్నది. అతడు తన ఇంట్లోనే డ్రగ్స్ పార్టీలు ఇచ్చేవాడని నిర్ధారణ కావడంతో అసలు ఈ పార్టీల్లో పాల్గొన్నదెవరు? టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారితో ఏమైనా లింక్‌లు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తున్నది. మస్తాన్ సాయి కేసును నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. హార్డ్ డిస్క్‌లో ఉన్న వీడియోల ఆధారంగా ఎంక్వైరీ కొనసాగుతున్నది.

Also Read : ఆ విట‌మిన్ లోపంతోనే ర‌క్త‌పోటు?

డ్రగ్స్ పార్టీలకు సంబంధించిన వీడియోలు కూడా ఉండటంతో ఆ కోణంలో దర్యాప్తు సాగుతున్నది. పోలీసులు కోర్టు అనుమతితో మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు కూపీ లాగబోతున్నట్టు తెలుస్తున్నది. మస్తాన్ సాయి (Mastan Sai)కి హీరో రాజ్ తరుణ్‌తో పరిచయం ఉన్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన మరికొందరితో కూడా అతనికి స్నేహం ఉన్నట్టుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మస్తాన్ సాయికి డ్రగ్స్ సప్లయ్ చేసింది ఎవరు? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగించనున్నారు.

Mastan Sai కేసులో రంగంలోకి నార్కోటిక్స్ పోలీసులు

మస్తాన్ సాయి కేసులో విచ్చలవిడిగా డ్రగ్స్ వీడియోలు వైరల్ గా మారడంతో నార్కోటిక్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. గతంలోనూ మస్తాన్ సాయి, లావణ్య పై డ్రగ్స్ కేసులు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వీరితో పాటు పార్టీల్లో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. హార్డ్ డిస్క్ లోని వీడియోలలో డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకొస్తున్నారు? ఎక్కడ పార్టీలు నిర్వహిస్తున్నారు ? ఎంత మంది పాల్గొన్నారు అనే అంశాల పై ఫొకస్ పెట్టారు.

4 రోజుల కస్టడీకి పోలీసుల పిటిషన్..

మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకున్న లోతుగా దర్యాప్తు చేస్తే డ్రగ్స్ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టొచ్చని నార్సింగి పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనిని నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు