వరంగల్ స్వేచ్ఛ: Chaddi Gang: ఇంతకాలం అనేక చోట్ల చెడ్డి గ్యాంగ్ దోపిడిల గురించి విన్నాం ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ ట్యాటులతో వరంగల్లో ప్రవేశించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. గతంలో అనేక దార్నాలకు పాల్పడ్డ పార్ధు గ్యాంగ్ లాంటి కరడు గట్టిన దొంగల ముఠాలను చూశాం కానీ ఇప్పుడు మరో డేంజర్ ముఠా దోపిడీలకు పాల్పడేందుకు రంగంలోకి దిగింది. అదే “టాటూ గ్యాంగ్” భారీ దోపిడీలకు పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన ఈ ముఠా వరంగల్ ను టార్గెట్ చేసింది. విశాలంగా ఉండే ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసి లూటీలకు బరితెగిస్తున్నారు.
తాజాగా హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భారీదోపిడీకి విఫల ప్రయత్నం చేశారు. షెడ్యూల్ వేసుకున్న ట్యాటూ గ్యాంగ్ ఆ ఇంట్లో దోపిడీకి ప్రయత్నించిన సమయంలో ఎవరు దొంగల కంట పడకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీసీ కెమెరాల్లో దొంగలు వచ్చిన తీరు చూసి షాక్ అయిన పోలీసులు ప్రత్యేక బృందాలతో వారికోసం గాలిస్తున్నారు.
ట్యాటు గ్యాంగ్ పై క్లారిటీ ఇవ్వని పోలీసులు
హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారణ్యపురిలో జరిగిన దొంగతనంతో వరంగల్ మహా నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీసీ కెమెరా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ దోపిడికి పాల్పడిన ముఠా మామూలు దొంగలు కాదని కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని గుర్తించారు. మొత్తం ఆరుగురు వ్యక్తులు ముసుగులు ధరించి దోపిడీలకు పాల్పడ్డారు. దొంగల ఒంటిమీద, ప్రతి ఒక్కరి ఎడమ చేతిపై పచ్చబొట్టు, చేతిలో మారణాయుధాలు కలిగి ఉండడం చూసి ఇదేదో డిఫరెంట్ డేంజర్ గ్యాంగ్ గా భావిస్తున్నారు.
Also Read: Cyber Crime: విదేశీ ఉద్యోగం మోజులో యువకులు.. సైబర్ క్రిమినల్స్ ఉచ్ఛులో నిత్యం… అదేపని
ఇప్పటి వరకు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పిన పోలీసులు దొంగతనం జరిగి వారం రోజులు సమీపిస్తున్న గ్యాంగ్ ఉనికిపై ఒక క్లారిటీ కి రాలేదు. కనీసం వారి ఆచూకీ ఆనవాళ్లు ఎక్కడ ఉన్నాయో నిర్ధారణకు రాలేకపోయారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం పై విమర్శలు వస్తున్నాయి.
దోపిడి విషయంపై పోలీసులు నిజాలు దాస్తున్నారా?
విద్యారణ్యపురిలో దోపిడీకి పాల్పడిన ఈ ముఠా ఆ ఇంటి కిటికీ గ్రిల్స్ ధ్వంసంచేసి ఇంట్లోకి ప్రవేశించారు. విలువైన వస్తువులు దొంగిలించారు. సీసీ కెమెరాల్లో వాళ్ల దోపిడి దృశ్యాలు అంతా రికార్డ్ అయ్యాయి. అర్థరాత్రి దోపిడికి పాల్పడిన ముఠా రెండున్నర గంటలపాటు ఆ ఇంట్లోనే గడిపినట్టుగా సీసీ కెమెరా ఫుటేజ్ లో లభ్యమైన ఆధారాలను బట్టి పోలీసులు గుర్తించారు. అయితే ఇంత సమయం తీసుకున్న దొంగలు దొంగిలించిన సొమ్ము విషయంలో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కేవలం రెండు గోల్డ్ కోటింగ్ సిల్వర్ కయిన్స్ మాత్రమే ఎత్తుకు పోయారు. విలువైన వస్తువులు పోలేదు అని ప్రకటించడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఏమైనా నిజాలు దాస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
ట్యాటు గ్యాంగ్ జాడ ఎక్కడ…?
ఈ ముఠా ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో ఆ ఇంట్లోని వారు గాడ నిద్రలో ఉన్నారు. ఎవరు నిద్రలేచి ప్రతిఘటించకపోవడం తో అంతా ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఊహించిన విధంగా ప్రాణనష్టం జరిగి ఉండేదని పోలీసులు అంటున్నారు. ఈ దోపిడీ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలో వాళ్ళు ఇంకా సిటీ దాటి వెళ్ళలేదని పోలీసు నిఘా వర్గాలు, సీసీఎస్ టీమ్స్ నిర్దాణకు వవచ్చాయి.. ఆరు ప్రత్యేక బృందాలతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వరంగల్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో తలదాచుకున్నారని కచ్చితంగా ఏదో ఒక దారుణానికి పాల్పడతారని పోలీసులు భావిస్తున్నారు.
ఈ దోపిడి ముఠా ఎలాంటి దారుణాలకు పాల్పడతారో అని ఓరుగల్లు ప్రజలు గజగజా వనికి పోతున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అనుమానితులు ఎవరైనా తారాసపడితే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. మరోవైపు పోలీసులు తగిన చర్యలు చేపట్టి టాటూ గ్యాంగ్ ను వెంటనే పట్టుకొని నగరంలో ఎలాంటి దోపిడీ దొంగతనాలు ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నగర ప్రజలు పోలీసులు కోరుతున్నారు.
Also Read: Crime: ప్రియుడి పై ప్రియురాలికి కోపం.. ఏకంగా 14 బైక్స్ కాల్చేసింది..