Omega Hospital: తెలంగాణ వైద్యో నారాయణ హరి అంటారు. ప్రాణాలను కాపాడుతారు కాబట్టే వైద్యులకు దేవుని స్థానం ఇచ్చారు. అంతటి పవిత్ర వృత్తిలో ఉండి ఓ డాక్టర్ డ్రగ్స్‌కు బానిసగా మారింది. చివరకు పోలీసులకు పట్టుబడి కటకటాల వెనక్కి చేరింది. గమనించాల్సిన అంశం ఏమిటంటే గడిచిన నాలుగేళ్లలో మాదక ద్రవ్యాల కోసం ఆమె 70 లక్షలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుండటం. వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని ఒమేగా హాస్పిటల్లో డాక్టర్చిగురుపాటి నమ్రత సీఈవోగా పని చేస్తోంది.
ఇదిలా ఉండగా నాలుగేళ్ల నుంచి నమ్రత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ముంబయికి చెందిన వంశ్ టక్కర్ అనే వ్యక్తి నుంచి కొకైన్ తెప్పించుకు9ని సేవిస్తోంది. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు నమ్రతపై నిఘా పెట్టారు. బాలకృష్ణ అనే వ్యక్తి 53 గ్రాముల కొకైన్‌ను ఆమెకు ఇస్తుండగా దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.
Also Read: Ganja Seized: తెలంగాణలో నేపాలీల గంజాయి దందా.. ఇద్దరు అరెస్ట్!
సంచలన వివరాలు
కాగా, నమ్రతను జరిపిన విచారణలో సంచలన వివరాలు వెలుగు చూశాయి. ముంబైకి చెందిన వంశ్ టక్కర్ హైదరాబాద్ తోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న వారికి కొన్నేళ్లుగా డ్రగ్స్ సప్లయ్చేస్తున్నట్టుగా తేలింది. దీని కోసం డ్రగ్స్ వినియోగిస్తున్న వారితో అతను ఏకంగా ఓ వాట్సాప్గ్రూప్నే పెట్టినట్టుగా వెల్లడైంది. వాట్సాప్‌నుంచి ఆర్డర్లు తీసుకుని ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపించుకొని వంశ్ టక్కర్ కొకైన్ సరఫరా చేస్తున్నట్టుగా తెలిసింది. నాలుగేళ్ల క్రితం ఓ పార్టీలో అతనితో నమ్రతకు పరిచయం ఏర్పడినట్టుగా తెలియవచ్చింది.
గ్రూప్ సభ్యుల వివరాలు
డ్రగ్ కొనుగోలుదారుల కోసం వంశ్టక్కర్ పెట్టిన వాట్సాప్‌గ్రూప్ లో నమ్రత సభ్యురాలిగా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఈ గ్రూప్ లో ఇంకా ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు? అన్న వివరాలను తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల కుటుంబాలకు చెందిన కొంతమంది ఈ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నట్టుగా తెలిసింది. వీరందరినీ ఒక్కొక్కరిగా పిలిపించి ప్రశ్నించాలని యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
Also Read: Drugs Case: షాకింగ్.. డ్రగ్స్‌కు బానిసైన నమ్రత.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు