MLC Kavita backlash in liquor scam
క్రైమ్

Delhi Liquor Case: మళ్లీ సీబీఐ వంతు..! తిహార్ జైలులో కవితను ప్రశ్నించనున్న సీబీఐ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం తిహార్ జైలులో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రశ్నించడానికి అనుమతించాని సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తిహార్ జైలులోనే ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేయడానికీ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

లిక్కర్ కేసులో ఈడీ ఆమెను అరెస్టు చేసి పది రోజులపాటు విచారించింది. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలుకు పంపించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారు. కొడుకు పరీక్షల కోసం తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై 8వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. కాగా, రెగ్యులర్ బెయిల్ పై 20వ తేదీన విచారించనుంది. ఇంతలోనే సీబీఐ కూడా ఆమెను విచారిస్తామని ప్రత్యేక పిటిషన్ వేసింది.

Also Read: ప్రతిపక్ష కూటమిలో పీఎం క్యాండిడేట్ ఎవరు? రాహుల్ గాంధీ సమాధానం ఇదే

సీబీఐ ఈ సారి ఆమె నుంచి ఏ విషయాలు రాబట్టాలని అనుకుంటున్నది? ఏ ప్రశ్నలు వేయనుంది? అనేవి ఆసక్తికరంగా మారాయి. బుచ్చిబాబు ఫోన్‌లో లభించిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అందరి ఫోన్‌లను ఫార్మాట్ చేసినా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన.. అందులోకి సౌత్ గ్రూప్ ఎలా ఎంటర్ కావాలి? వంటి వివరాలు బుచ్చిబాబు పోన్‌లో లభించినట్టు దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఇందుకు సంబంధించి కవితను ప్రశ్నించవచ్చు. దీనితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు హవాలా మార్గంలో ముట్టజెప్పారా? అందుకు సంబంధించిన వివరాలనూ సీబీఐ అడగవచ్చు. ఒక వేళ కవిత సహకరించకపోతే.. జైలులో కవిత దర్యాప్తునకు సహకరించడం లేదని, తమ కస్టడీకి ఆమెను ఇవ్వాలనీ సీబీఐ పిటిషన్ వేయవచ్చు. ఒక వేళ సీబీఐ ఆమెను కస్టడీలోకి తీసుకోవాలని అనుకుంటే ఈడీ కేసులో బెయిల్ లభించినా కవిత బయటికి రావడం సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మళ్లీ సీబీఐ కేసులోనూ బెయిల్ లభించాల్సి ఉంటుంది.

ఢిల్లీ లిక్కర్ కేసును మొదటగా టేకప్ చేసింది సీబీఐనే. ఢిల్లీ మద్యం పాలసీపై అవకతవకలు జరిగాయని లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయగా.. హోం శాఖ ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐకి అప్పగించింది. సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో కోట్ల డబ్బు వ్యవహారం ముందుకు రావడంతో ఈడీ కూడా రంగంలోకి దూకింది.

Also Read:  కేసీఆర్ పర్యటనలో జేబుదొంగలు.. మాజీ సీఎంకు ఏంటీ తిప్పలు?

2022 డిసెంబర్‌లో ఈ కేసులో సీబీఐ కవితను ప్రశ్నించింది. అప్పుడు ఆమెను ఒక సాక్షిగా మాత్రమే సీబీఐ విచారించింది. ఇటీవలే ఆమెను ఈ కేసులో కింగ్‌పిన్‌గా పేర్కొంది. కవితను విచారించడానికి సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 26న నోటీసులు పంపింది. కానీ, కవిత సీబీఐ ఎదుట హాజరు కావడానికి నిరాకరించారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విచారణకు పిలవడం వెనుక ఉద్దేశాన్ని ఆమె ప్రశ్నించారు. ముందుగా నిర్ణయించుకున్న పనులు, బాధ్యతలు ఉన్నందున సీబీఐ విచారణకు హాజరు కాలేనని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈడీ అరెస్టు చేసింది. ఇంతలో కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు తేలిన నేపథ్యంలో కవితను మరోసారి ప్రశ్నించాలని సీబీఐ భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్