PM Candidate: ప్రతిపక్ష కూటమిలో ఐక్యత, పటిష్ట నాయకత్వం బలంగా లేదని కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకే బీజేపీ నాయకులు తరుచూ ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. ప్రతిపక్ష కూటమి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఉంటారో చెప్పండని అడుగుతుంటారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని దీటుగా ఎదుర్కొనే నాయకుడు విపక్ష శిబిరంలో ఎవరు? అనీ ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి సమాధానాలు వస్తూ ఉంటాయి. ఇదే ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఈ రోజు సమాధానం ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లోక్ సభ ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను విడుదల చేసింది పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీస్ పేరిట ఈ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని అభ్యర్థిత్వంపై కామెంట్ చేశారు. ఈ లోక్ సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే శక్తులకు, వాటిని కాపాడేవారికి మధ్య జరుగుతున్నాయని అన్నారు. మీడియాలో చెబుతున్నట్టుగా కాకుండా ఈ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతున్నాయని చెప్పారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఇండియా షైనింగ్ ప్రచారం చేసినట్టుగానే ఇప్పుడూ చేస్తున్నదని, కానీ, కాంగ్రెస్ చేతిలో ఓడిపోక తప్పలేదని పేర్కొన్నారు. ఇండియా కూటమి తాము భావజాలపరమైన ఎన్నికలను ఎదుర్కొంటున్నట్టు తీర్మానించుకున్నాయని వివరించారు. కాబట్టి, ఇక్కడ ప్రధానమంత్రి అభ్యర్థిపై చర్చ ఎక్కువ లేదని తెలిపారు. ఎన్నికల తర్వాతే తాము ప్రధానమంత్రి అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Also Read: కేసీఆర్ పర్యటనలో జేబుదొంగలు.. మాజీ సీఎంకు ఏంటీ తిప్పలు?
ఇటీవలే శశిథరూర్ ఇచ్చిన సమాధానం అదిరిపోయింది. ఇది అధ్యక్ష తరహా ఎన్నికలు కావని అన్నారు. అధ్యక్ష తరహా ఎన్నికల్లో ముందుగానే అధ్యక్షుడిని ప్రకటించాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యేకంగా పార్టీలోనే పోటీ ఉంటుంది. కానీ, మన దేశ తరహా ఎన్నికల్లో ప్రజలు ప్రత్యక్షంగా ప్రధానిని ఎన్నుకోరు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రధానమంత్రిని ఎంపిక చేసుకుంటారు. కాబట్టి, ముందుగానే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.