Crime News: సికింద్రాబాద్ నుండి శైవ క్షేత్రం కురవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఓ ఫ్యామిలీ మొత్తం ఆలయానికి వస్తుండగా ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఖమ్మం(Khammam), వరంగల్(Warangal) నేషనల్ 563 హైవేపై గుంతను తప్పించబోయిన డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవడంతో బోల్తా పడింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. జాతీయ రహదారిపై నుంచి రోడ్డు పక్కకు ఒక్క సైడు పడిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరికీ గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బస్సు ఒకపక్కకు పడిపోవడంతో సీట్లు విరిగిపోయి, బస్సు అంత నుజు నుజ్జుగా మారిపోయిందని అక్కడి స్ధానికులు తెలిపారు.
అర్ధరాత్రి బస్సు బోల్తా..
కురవి వీరభద్ర స్వామి శైవ క్షేత్రానికి దర్శనం కోసం ఓ ప్రైవేట్ బస్సును మాట్లాడుకొని వస్తున్న హైదరాబాద్ కు చెందిన ఒకే ఫ్యామిలీ బస్సు బోల్తా పడడంతో అందరికీ గాయాలయ్యాయి. రాత్రి 12 గంటల సమయంలో మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో గుంతను తప్పించబోయే క్రమంలో ప్రమాదానికి గురైనట్లుగా పోలీసులు చెబుతున్నారు. గాయపడిన క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైవే ప్రమాదాలకు బ్లాక్ స్పాట్..
ఖమ్మం(Khammam), వరంగల్ 563 నేషనల్ హైవే ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. గడిచిన ఏడాదికాలంగా పలు ప్రమాదాలు జరిగి గాయాల బారిన కొంతమంది పడితే, మరికొంతమంది మృతి చెందిన ఘటనలు సైతం ఉన్నాయి. మనవడి పుట్టు వెంట్రుకలు తీసి, కురవి వీరభద్ర స్వామి ఆలయంలో అభిషేకం చేయించేందుకు కుటుంబ సభ్యులతో అందరూ కురవికి బయలుదేరారు. ఇంతలోనే ఘటన జరగడం బాధాకరంగా ఉందని క్షతగాత్రులు వెల్లడిస్తున్నారు. ఈ నేషనల్ హైవేపై గతంలో కూడా చాలా ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా మరమ్మత్తులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Maoist Posters: వడ్డీ వ్యాపారులారా ఖబర్దార్?.. భద్రాచలంలో మావోల పోస్టర్లు కలకలం
