advance release date strategy: టాలీవుడ్ పరిశ్రమలో చిత్రాల నిర్మాణ వ్యయం రోజు రోజుకు పెరిగిపోతుంది. దానిని తట్టుకోవడానికి నిర్మాతలు అనేక విధాలుగా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రాలు రిలీజ్ కాకముందే సాధారణంగా 6 నుంచి 12 నెలల ముందు వాటి విడుదల తేదీని ప్రకటించడం సాధారణం. ఇది కేవలం ఫ్యాన్స్ ఆసక్తిని పెంచడమే కాకుండా, ఒక ఆర్థిక వ్యూహాత్మక చర్యగా పరిగణించబడుతోంది. ఉదాహరణకు, ‘పుష్ప 2: ది రూల్’ (2024) ముందుగానే తేదీ ప్రకటించి, ‘బాహుబలి 2’, ‘కల్కి 2898 ఏడి’ చిత్రాలు విడుదల తేదీలు ముందుగానే ప్రకటించడంతో ప్రీ-రిలీజ్ సేల్స్‌లో ఇది సినిమాను ముందుంచుతుంది. ఇలాంటి ప్రాక్టీస్ టాలీవుడ్‌లో ఎందుకు? దీని వల్ల ఎవరికి లాభం? ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
Read also-Srikanth Iyengar: ఆ నటుడిపై ‘మా’ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ.. చర్యలు తప్పవా?
ప్రధాన కారణాలు
టాలీవుడ్ చిత్రాల బడ్జెట్ రూ.500 కోట్లు దాటుతుంది, కాబట్టి ముందస్తు డబ్బు అవసరం. రిలీజ్ తేదీ ముందుగా ఫిక్స్ చేయడం ‘ప్రీ-సేల్స్ మోడల్’కు ఆధారం. ఇది మార్కెటింగ్ కు మరింత ఊతం ఇస్తుంది. తేదీ ప్రకటనతో ఫ్యాన్స్, మీడియా దృష్టి ఆకర్షిస్తుంది. ట్రైలర్లు, పోస్టర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు వైరల్ అవుతాయి. ఇది బజ్ సృష్టించి, అడ్వాన్స్ బుకింగ్‌లను పెంచుతుంది. ప్రీ-సేల్స్ ప్రాసెస్ లో సాటిలైట్, ఓటీటీ, మ్యూజిక్, ఓవర్సీస్ హక్కులు ముందుగా అమ్ముకోవడానికి తేదీ అవసరం. ఇది బడ్జెట్‌లో 50-70% మొత్తం ముందుగానే కవర్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్ సమయం ఉంటుంది. పోటీ సినిమాలతో క్లాష్ జరగకుండా స్క్రీన్లు బుక్ చేయవచ్చు. సంక్రాంతి, దీపావళి వంటి ఫెస్టివల్స్‌కు ముందుగా లాక్ చేస్తారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (2022) ముందుగా తేదీ ప్రకటించి, సాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ హక్కులతో రూ.1,200 కోట్లు ప్రీ-సేల్స్ సాధించింది. ‘పుష్ప: ది రైజ్’ (2021)లో అమెజాన్ ప్రైమ్‌కు డిజిటల్ హక్కులు రూ.175 కోట్లకు అమ్మారు. దీని వల్ల ప్రీ-సేల్స్ టాలీవుడ్‌లో రెవెన్యూ 50% ముందుగానే వస్తుంది. ఇది రిస్క్ తగ్గించి, ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను మెరుగుపరుస్తుంది.
Read also-OTT Releases: ఈ వారం ఓటీటీలో మన ముందుకొచ్చే వినోదం ఇదే.. రండి ఓ లుక్కేద్దామ్..
ఎవరికి లాభం?
నిర్మాతలు ఈ పద్దతి ఎంతగానో దోహదపడుతుంది. బడ్జెట్‌లో 50-70% ముందుగానే రికవర్ అవుతుంది, నిర్మాత తీసుకోవాల్సిన లోన్లు తగ్గుతాయి. ఇలా వచ్చిన మొత్తాన్ని మార్కెటింగ్‌కు ఇన్వెస్ట్ చేయవచ్చు. డిస్ట్రిబ్యూటర్లు అయితే స్క్రీన్లు ముందుగా బుక్ చేసి, టెర్రిటరీలు సెక్యూర్ చేసుకోవచ్చు. పోటీ అంచనా వేసి గ్యారంటీడ్ రెవెన్యూ పొందవచ్చు. సాటిలైట్ ప్లాట్‌ఫారమ్‌ల సంస్థలకు అయితే.. హైప్ పెరగకముందే చౌక ధరకు కంటెంట్ సెక్యూర్ చేసుకోవచ్చు. ఎక్స్‌క్లూసివ్ డీల్స్‌తో ప్రాఫిట్ పొందవచ్చు. ఇలా చేయడం వల్ల స్టార్ వాల్యూ, బ్రాండ్ వాల్యూ పెరగక ముందే ప్రాజెక్టును తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇలా అనేక లాభాలు ఉండటంతో సినిమా ప్రకటించిన మొదటి రోజే విడుదల తేదీ కూడా ప్రకటిస్తున్నారు. ఇది నిర్మాతలకు ఆర్థికంగానే కాకుండా మూవీ టీంకు సినిమాను త్వరగా పూర్తి చేసి వేరే ప్రాజక్టు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అందుకే సినిమా తేదీని ముందుగా ప్రకటిస్తున్నారు.
