Balanagar Crime: సెలవుల్లో ఎంజాయ్ చేద్దామంటూ పదకొండేళ్ల చిన్నారిని ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడి జరిపిన యువకున్ని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ కే.సురేష్ కుమార్ గురువారం అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ నరేశ్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాలానగర్ ప్రాంతంలోని వినాయక్ నగర్ వాస్తవ్యుడైన రాబిన్సన్ డీ కార్నెల్ (25) క్యాటరింగ్ వర్కర్ గా పని చేస్తున్నాడు. ఇదెలా ఉండగా బాలానగర్ ప్రాంతానికి చెందిన ఓ పదకొండేళ్ల బాలికతో కొంతకాలం క్రితం పరిచయం చేసుకున్నాడు.
తీయటి మాటలు, పొగడ్తలతో బాలికకు దగ్గరయ్యాడు. 2023, మే 22న రాత్రి 8గంటలకు బాలికను కలిసిన రాబిన్సన్ ఇంట్లో నుంచి డబ్బు, దుస్తులు, మీ అమ్మ మొబైల్ ఫోన్ తీసుకుని అర్ధరాత్రి 1గంటకు వస్తే బయటి ప్రాంతానికి పోయి బాగా ఎంజాయ్ చేసి వద్దామన్నాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారి ఇంట్లో నుంచి 30వేల రూపాయలు, రెండు మూడు జతల దుస్తులు, తన తల్లి మొబైల్ ఫోన్ తీసుకుని తెల్లవారుఝాము 2గంటల సమయంలో రాబిన్సన్ ను కలిసింది. బాలికను సికింద్రాబాద్ స్టేషన్ కు తీసుకెళ్లిన రాబిన్సన్ ఆ తరువాత రైల్లో విశాఖపట్టణం తీసుకెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన వారెంట్లో బాలికను పెట్టాడు.
Also Read: Bhoodan Land Case: ఈడీ కేసును కొట్టేయలేం.. భూదాన్ భూములపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఆ తరువాత పలుమార్లు చిన్నారిపై అఘాయిత్యం జరిపాడు. దాంతో బాలిక తీవ్ర గాయాలకు గురైంది. దాంతో భయపడి ఏడు రోజుల తరువాత రైల్లో హైదరాబాద్ తీసుకొచ్చాడు. వాటర్ బాటిల్ తెస్తానని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బాలికను కూర్చోబెట్టి పరారయ్యాడు. దారిన వెళుతున్న వ్యక్తి నుంచి సెల్ ఫోన్ తీసుకుని బాధితురాలు తండ్రికి ఫోన్ చేయగా ఆయన వచ్చి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లాడు. జరిగిన విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు పోలీసులు పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి నిందితుని కోసం గాలింపు మొదలు పెట్టారు. అయితే, రాబిన్సన్ వారి చేతికి చిక్కలేదు. అయినా, సీఐ నర్సింహ రాజు, ఎస్సై వినోద్ కుమార్, కానిస్టేబుళ్లు ఇఫ్తెకార్, కృష్ణయ్య, మహ్మద్ ఖదీర్, శ్రీనివాస్ లతో కలిసి పట్టు వదలకుండా వేటను కొనసాగించారు. చివరకు యాప్రాల్ ప్రాంతంలో రాబిన్సన్ ఉంటున్నట్టు గుర్తించి అతని కదలికలపై కన్నేశారు. గురువారం రాబిన్సన్ సికింద్రాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన నాయనమ్మను చూడటానికి రాగా అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Notice to Jhansi reddy: కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి షాక్!..హైకోర్టు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?