Notice to Jhansi reddy: కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డికి గురువారం హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డి దంపతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో 75 ఎకరాల భూమిని కొన్నదానిపై దామోదర్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ చర్యలు తీసుకుంది.
గతంలో భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించిన ఝాన్సీరెడ్డి తన భర్త రాజేందర్ రెడ్డితో కలిసి 2017లో గుర్తూరులో 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ భూమిలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేయటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
ఈ క్రమంలో వర్ధన్నపేట ఇల్లంద ప్రాంతానికి చెందిన దామోదర్ రెడ్డి దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. విదేశీయురాలైన ఝాన్సీరెడ్డి ఇక్కడ వ్యవసాయ భూమిని కొనటం ఫెమా ప్రకారం నేరమని అందులో పేర్కొన్నారు తప్పుడు ధృవీకరణ పత్రాలు చూపించి భూమిని కొనుగోలు చేశారని ఆరోపించారు. విదేశీ పౌరులు ఇక్కడ వ్యవసాయ భూములను కొనటం నేరమని పేర్కొన్నారు.
గతంలో ఇలాంటి ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న ఉదంతాలున్నాయని తెలిపారు. దీనిపై హైకోర్టు జడ్జి జస్టిస్ భాస్కర్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. జూన్ 19వ తేదీలోపు వివరణ ఇవ్వాలంటూ ఝాన్సీరెడ్డి ఆమె భర్త రాజేందర్ రెడ్డితోపాటు రెవెన్యూ అధికారులకు తాజాగా నోటీసులు జారీ చేసింది.
Also Read: KTR on CM Revanth: సీఎం రేవంత్‌కు ఆ వ్యాధి ఉంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు