Nagarkurnool(Image Credit:Twitter)
క్రైమ్

Nagarkurnool: వివాహితపై దారుణం.. బంధువును తాళ్లతో కట్టేసి.. 8 మంది గ్యాంగ్ రేప్

Nagarkurnool: ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. అలాంటి దుర్ఘటన మరోసారి నాగర్ కర్నూల్ జిల్లాలోని ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో వెలుగు చూసింది. దైవ దర్శనానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దేవుని ఆశీస్సుల కోసం అని ఆలయానికి వచ్చిన ఆమె జీవితం క్షణాల్లో చీకటిమయమైంది. నిందితులను పోలీసులు గుర్తించి, కొందరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ.. ఈ దారుణం మహిళల భద్రతపై మళ్లీ ప్రశ్నలను లేవనెత్తింది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి శనివారం సాయంత్రం ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి ముక్కులు తీర్చుకునేందుకు వచ్చింది. దర్శనం ముగిసిన తర్వాత రాత్రి అక్కడే బస చేయాలని నిర్ణయించుకున్న వారు, అనుకోని విధంగా ఈ దుర్ఘటనకు గురయ్యారు. రాత్రి సమయంలో యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతంలోకి వెళ్లగా, అక్కడ మాటువేసి ఉన్న యువకులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెతో ఉన్న బంధువుపై దాడి చేసి అతడి చేతులు కట్టేసిన నిందితులు, యువతిని బలవంతంగా గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Also Read: ప్రియుడి పై ప్రియురాలికి కోపం.. ఏకంగా 14 బైక్స్ కాల్చేసింది..

పోలీసులు నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతుండగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలికి వైద్య సహాయం అందిస్తూ, కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఇలాంటి ఘటనలు మన దేశంలో కొత్త కాదు. 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా ఆగ్రహ తీవ్రతను రేకెత్తించింది. ఒక యువతిని కదిలే బస్సులో అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. ఆ ఘటన తర్వాత కఠిన చట్టాలు రూపొందాయి. అయినప్పటికీ, 2019లో హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్‌లో దిశ కేసు మరోసారి సమాజాన్ని కదిలించింది.

ఒంటరిగా ఉన్న ఒక యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి, ఆమెను సజీవ దహనం చేశారు. ఆ ఘటన తర్వాత పోలీసుల కాల్పుల్లో నిందితులు హతమయ్యారు. అంతకు ముందు, 2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఒక యువతిపై జరిగిన అత్యాచారం కేసు రాజకీయ రీత్యా కూడా వివాదాస్పదమైంది. ఈ ఘటనలన్నీ చట్టాలు ఉన్నా, అమలు బలహీనంగా ఉండటం, సామాజిక మనస్తత్వంలో మార్పు రాకపోవడం వంటి సమస్యలను ఎత్తి చూపుతున్నాయి.

Also Read: విదేశీ ఉద్యోగం మోజులో యువకులు.. సైబర్ క్రిమినల్స్​ ఉచ్ఛులో నిత్యం… అదేపని

ఇటీవలే, 2022లో హర్యానాలోని ఒక గ్రామంలో ఆలయంలో పూజలు చేస్తున్న యువతిపై దాడి జరిగిన ఘటన కూడా ఈ తరహా సంఘటనలకు ఆలయ ప్రాంగణాలు సైతం మినహాయింపు కావని తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ ఘటన కూడా ఆలయాల వంటి పవిత్ర స్థలాల్లో సైతం మహిళల భద్రత లేని దుస్థితిని బహిర్గతం చేస్తోంది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిందితులకు కఠిన శిక్షలు పడితేనే ఇలాంటి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల భద్రత కోసం పోలీసు గస్తీని పెంచాలని, రాత్రి సమయాల్లో ఆలయాల వద్ద భద్రతా సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. ఈ ఘటన మళ్లీ మహిళల రక్షణ, సామాజిక అంశాలపై అనేక ప్రశ్నలకు అవకాశమిస్తోంది.

ఏడుగురు నిందితులు అరెస్టు..
ఆంజనేయస్వామి దర్శనానికి గుడికి వచ్చిన మహిళపై ఉరుకొండ గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అత్యాచార ఘటనలో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మహిళను మెడికల్ ఎగ్జామినేషన్‌కు పంపి నిజ నిజాలను పరిశీలిస్తున్నామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ తెలిపారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ