You Will Be In My Every Memory Miss You Mahesh Babu Emotional Post
Cinema

Hero Mahesh: హీరో మహేశ్ ఎమోషనల్‌ పోస్ట్‌ 

You Will Be In My Every Memory Miss You Mahesh Babu Emotional Post: దివంగత హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా కృష్ణ తనయుడు టాలీవుడ్ హీరో మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. తండ్రిని తలుచుకొని మిమ్మల్ని నేను చాలా మిస్సవుతున్నాను. నా గుండె లోతుల్లో, నా ప్రతి జ్ఞాపకంలో నువ్వు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావని ఎమోషనల్‌ పదాలను రాసుకొచ్చాడు.

అలాగే తండ్రి కృష్ణ ఫొటో షేర్ చేశాడు. కాగా, టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణ అన్నిరకాల ప్రయోగాలు చేశాడు. అటు డైరెక్టర్‌గా, నిర్మాతగా.. ఇటు హీరోగా నటించి టాలీవుడ్‌ అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన శైలిలో ఎన్నో హిట్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించి టాలీవుడ్‌ రంగంలో చెరగని ముద్ర వేశాడు. కానీ 2022 ఏడాదిలో హార్ట్ ఎటాక్ రావడంతో సడెన్‌గా మృతి చెంది తన అభిమానులను షాక్‌కు గురి చేశాడు. తన మ్యానరిజంతో అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్‌ని మెప్పించాడు.

Also Read: ఆమెతో హీరో డేటింగ్‌, వైరల్ అవుతోన్న ఫొటోస్‌ 

అందుకే ఇప్పటికీ కృష్ణను మర్చిపోలేదు ఆయన ఫ్యాన్స్. అల్లూరి సీతారామరాజు మూవీలోని పాట తెలుగువీర లేవరా అంటూ, మోసగాళ్లకి మోసగాడు అదేవిధంగా జేమ్స్‌ బాండ్‌ 777 మూవీలో తన అద్భుతమైన నటనతో హాలీవుడ్‌ తారలను ఏం మాత్రం తీసిపోలేని గుర్తులను మిగిల్చాడు. కృష్ణ వారసుడిగా వచ్చిన చిన్నకుమారుడు మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్‌ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో తన క్రేజ్‌ను పదిలం చేసుకుంటూ మూవీస్‌పై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 

View this post on Instagram

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు