Who Is Actress Juhi Chawlas Husband Jay Mehata How Much Is His Property
Cinema

Actress Juhi Chawla:స్టార్ హీరోయిన్ భర్త ఓ బిలియనీర్ అని మీకు తెలుసా.?

Who Is Actress Juhi Chawlas Husband Jay Mehata How Much Is His Property: ఐపీఎల్ జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లను చూస్తున్నట్లయితే మీరు సెలబ్రిటీ గ్యాలరీలో తన జట్టును ఉత్సాహపరుస్తున్న బాలీవుడ్ నటుడు, జట్టు యజమానిలలో ఒకరైన షారుఖ్ ఖాన్‌ ఖచ్చితంగా కనిపిస్తారు. షారుఖ్‌తో పాటు నటి జుహీ చావ్లాను కూడా మనం ఇందులో చూడవచ్చు. ఈ హీరోయిన్‌తో పాటు ఆమె భర్త జే మెహతా, కేకేఆర్‌ జట్టుకి మరొక యజమాని అనే విషయం మీకు తెలుసా… ఈ విషయం చాలా మందికి తెలియదు. దీనికి యజమాని కాబట్టే ఎప్పుడు వీఐపీ గ్యాలరీలో ఈ ముగ్గురు కనిపిస్తారు.సినీ నటులు ,నటీమణులు బడా వ్యాపారవేత్తలు డబ్బు పెట్టుబడిగా పెట్టి వారి ఇష్టమైన ఐపీఎల్‌ జట్ల ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు.

ఈ ముగ్గురూ కేకేఆర్‌ జట్టు ఫ్రాంచైజీలు. అంటే వారు జట్టు యజమానులతో సమానం. కేకేఆర్ మ్యాచ్‌ల టైంలో తరచుగా స్టేడియం గ్యాలరీలో కనిపిస్తారు. షారుక్ , జూహీ చావ్లా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు మూవీ సెలబ్రిటీలన్న మ్యాటర్‌ అందరికి తెలుసు. అయితే జూహీ భర్త జే మెహతా గురించి చాలా మందికి తెలియదు. ఈ జై మెహతా ఎవరు? అతనికి ఏ ఏ కంపెనీలు ఉన్నాయో తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. అలాగే ఆయన ఆస్తుల విలువ కూడా తక్కువేమి లేదు.జే మెహతా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే కేకేఆర్ జట్టు సహ యాజమానిగానే కాకుండా బడా వ్యాపారవేత్తగా కూడా పేరు పొందారు.

Also Read: నిహారిక కొణిదెల సమర్పణలో రాబోతున్న మూవీ

జే మెహతా మల్టీ నేషనల్ కంపెనీ గ్రూప్ ది మెహతా గ్రూప్ వ్యవస్థాపకుడు. ఇది భారత్‌, ఆఫ్రికా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ అంతటా పనిచేస్తుంది.ది మెహతా గ్రూప్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం కంపెనీ విలువ 500 మిలియన్ యూఎస్‌ డాలర్లు! మన కరెన్సీ రూపంలో చెప్పాలంటే దీని విలువ అక్షరాల రూ. 4162 కోట్లు. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 15వేల కంటే ఎక్కువ మంది ఎంప్లాయిస్ ఉన్నారు.వీటితో పాటు జూహిచావ్లా భర్త జై మెహతా మరో రెండు ఇండియన్ బిగ్ కంపెనీలున్నాయి.

సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్ , గుజరాత్ సిద్ధి సిమెంట్ లిమిటెడ్ కంపెనీలు కూడా వీరివే. మొత్తం మీద జూహీ చావ్లా భర్త భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరని చెప్పవచ్చు.జనవరి 18, 1961న జన్మించిన జై మెహతా మహేంద్ర మెహతా, సునయన మెహతా దంపతుల కుమారుడు. మొదట కొలంబియా యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ చదివాడు. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేశాడు.1995లో జై మెహతా బాలీవుడ్ నటి జుహీ చావ్లాతో స్నేహితుల వివాహ వేడుకలో పరిచయం అవడం వెంటనే వీళ్లిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. జూహిచావ్లా కుమార్తె పేరు జాహ్నవి, కొడుకు పేరు అర్జున్.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?