War 2 Leaked Pics Hrithik Roshan Jr Ntr In Action: టాలీవుడ్, బాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతో ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్న మూవీస్‌లో వార్ 2 ఒకటి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో స్పై జోనర్‌లో వస్తోన్న ఈ మూవీలో గ్లోబల్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
వార్ 2 క్లైమాక్స్‌లో తారక్, హృతిక్ రోషన్ మధ్య స్టన్నింగ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని ఫైట్‌మాస్టర్ అనల్ అరసు ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతుండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వార్ 2 మూవీకే హైలెట్‌గా నిలిచే ఓ సీన్ ఉందట. హృతిక్ రోషన్, తారక్ మధ్య వచ్చే హై స్పీడ్ బోట్ ఛేజ్ సీక్వెన్స్. భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ చూడని విధంగా మరణ మృదంగం వాయిస్తున్నట్టుగా ఒళ్లు గగుర్పొడిచేలా ఈ యాక్షన్ సీన్ ఉండబోతుందని మూవీ సర్కిల్‌లో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్
ఇటీవలే ఆరు రోజుల పాటు ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్టు సమాచారం. అయాన్ ముఖర్జీ టీం ఇప్పటికే లాంఛ్ చేసిన వార్ 2 గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటిని పెంచేస్తుంది. 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా వార్ 2 మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీపై బాలీవుడ్, టాలీవుడ్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
Massively Filmed A Mounted Speed Boat Chase Sequence On @tarak9999 & @iHrithik Over Six Days ❤️🔥❤️🔥.
This Specific Sequence Took Three Months To Design And Was Shot With South African Action Director Franz Spilhaus 🔥🔥.#War2 #YRFSpyUniverse #AyanMukerji #JrNTR #HrithikRoshan pic.twitter.com/glofMvkl8m
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) June 24, 2024