Hero Fire | యూట్యూబర్‌పై హీరో ఫైర్‌
Vishwaksen Fires On Youtuber Who Compares Kalki 2898 ad Movie To Says Privacy
Cinema

Hero Fire: యూట్యూబర్‌పై హీరో ఫైర్‌

Vishwaksen Fires On Youtuber Who Compares Kalki 2898 ad Movie To Says Privacy: మహానటి ఫేమ్ డైరెక్టర్‌ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో డార్లింగ్‌ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన భారీ మూవీ జూన్ 27న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ గురించి తాజాగా కల్కి మూవీపై ఓ యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్ చేశాడు.

ఇదే అంశంపై యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫైర్ అవుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. బార్బెల్ పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ర‌న్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబ‌ర్ క‌ల్కి సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్‌పై విశ్వక్ సేన్ రియాక్ట్ అవుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అతన్ని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు. అందులో సినిమాలు రిలీజ్ కూడా అవకముందే చెంబులు పట్టుకొని కొంద‌రూ బయలుదేరుతున్నారు. యూట్యూబ్‍లో మీ ఆదాయం పెంచుకోవడం కోసం వేల కుటుంబాలు నడుస్తున్న మూవీ ఇండస్ట్రీతో మజాక్‍లు అయిపోయాయి మీకు.వీడు ఒక పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం.

Also Read: అనారోగ్యంతో మెగాస్టార్ కూతురు మాజీ భర్త మృతి

లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్లు అనుకుని ఇగ్నోర్ చేద్దాం. ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి. అప్పుడు మీకు, మీ ఒపీనియన్‍కు కాస్త గౌరవం ఉంటుంది. మన చుట్టూ ఉన్న కొంత మంది పైరసీ కంటే డేంజర్. సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం, చెమటను, ఎంతో మందికి జోవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానంటూ రాసుకొచ్చాడు.

Just In

01

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం