Upasana as brand ambassidor
Cinema

Konidela Upasana:కొణిదెల ఉపాసనకు అరుదైన గౌరవం

Upasana Konidela appointed wwf national brand ambasodor:

మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూ డబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్ గా నియమితులైనట్లు నాగర్ కర్నూల్ డీఎఫ్ ఓ రోహిత్ గోపిడి ఓ ప్రకటనలో తెలిపారు. . అపోలో దవాఖాన ట్రస్ట్‌లో సామాజిక సేవాకార్యక్రమాల విభాగంలో వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న ఉపాసనకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా విభాగం.. అపోలో హాస్పిటల్‌ ట్రస్ట్‌ మధ్య ఒప్పందం ప్రకారం నాలుగేండ్లపాటు పదవీ బాధ్యతలు అప్పజెప్పినట్టు పేర్కొన్నారు. తాజా ఒప్పందం నేపథ్యంలో సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణి రక్షిత ప్రాంతాల్లో గాయపడిన పులులు వైద్యం అందించడంతోపాటు, అటవీశాఖ సిబ్బందికి అపోలో దవాఖానలో నాణ్యమైన చికిత్స అందిస్తారని తెలిపారు.

ఎప్పటికప్పుడు జంతువులకు టీకాలు

వన్య ప్రాణులకు అవసరమైనటువంటి వసతుల్లో భాగంగా నివాసం, మైదానాలు, నీటి వసతి ఉండేలా చర్యలు తీసుకోవడమే కాకుండా నిబంధనల మేరకు జంతువులకు ఆరోగ్య పరీక్షలు కూడా చేయించి, అవసరమైనటువంటి టీకాలను ఎప్పటికప్పుడు వేయించి, ఆరోగ్య రీత్యా కూడా చూసుకుంటారు. ఈ ప్రక్రియలో భాగంగానే వన్యప్రాణుల రక్షణకు ఉపాసనను నేషనల్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. .అటవీ ప్రాంతాల్లో జీవించే వన్య ప్రాణులు వేసవిలో నీటి కొరతతో ప్రాణాలు కొల్పోకూడదనే ఉద్దేశంతో అటవీశాఖ చర్యలు చేపట్టింది.వేసవిలో నీటి కోసం జంతువులు సమీప పొలాల్లోనే నీటి వనరుల వద్దకు వచ్చిన క్రమంలో కొందరు వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడుతుంటారు.వేటగాళ్ల బారిన ఈ వన్య ప్రాణులు పడకుండా ఉండటానికి వాటి కోసం అటవీ ప్రాంతాల్లోనే ప్రత్యేక నీటి గుంతలు ఏర్పాటు చేయడంతోపాటు, అటవీ ప్రాంతంలో భూమికోతకు గురికాకుండ భూసారాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో అటవీశాఖ పలు చర్యలు తీసుకుంది.

చెక్ డ్యాముల ఏర్పాటు

సహజ నీటి వనరులు లేని చోట నీటిని అందుబాటులో ఉంచే విధంగా చెక్‌డ్యాంలు, ససార్‌ పిట్లు, నీటికుంటలు, చెక్‌వాల్స్‌ సోలార్‌ బోర్లను ఏర్పాటు చేశారు.అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటగాళ్ల ఆటకట్టించేందుకు, అటవీ సంపదను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వేటగాళ్లపై నిరంతర నిఘా పెట్టి వారి కదలికను నియంత్రిస్తున్నారు.అభయారణ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు గూడేలలో గార్డుల నిఘాతోపాటు కొరియర్‌ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?