Triptii Dimri Buys House Mumbai After Animal Success
Cinema

Bollywood Actress: అందాల తార ఇల్లు, చాలా కాస్ట్లీ గురూ..! 

Triptii Dimri Buys House Mumbai After Animal Success: యానిమల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే హీరో తన తండ్రిపై ఉన్న ప్రేమని డైరెక్టర్ చూపించిన విధానం ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఈ మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ హీరో రణబీర్‌ కపూర్ సరసన యాక్ట్ చేసిన నటి తృప్తి డిమ్రి సూపర్ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీతో తృప్తి డిమ్రి నేషనల్‌ వైడ్‌ క్రష్‌గా మారిపోయింది. యానిమల్ మూవీ సక్సెస్‌తో తృప్తి డిమ్రికి క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

తృప్తి డిమ్రి 2017లో అగ్రనటి శ్రీదేవి నటించిన మామ్ మూవీలో చిన్న రోల్‌ చేసింది. అప్పటి నుంచే తృప్తి మూవీ ట్రావెలింగ్‌ స్టార్ట్ అయ్యింది. ఒక్క మూవీతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. తృప్తి డిమ్రి ఉత్తరాఖండ్‌ వాసి. మామ్‌, పోస్టర్‌ బాయ్స్‌, లైలా మజ్ను వంటి పలు చిత్రాల్లో నటించింది. తన కెరీర్‌ టర్న్‌ అయింది మాత్రం బుల్‌బుల్‌ చిత్రంతోనే. తాజాగా తృప్తి మరో సంచలనం సృష్టించింది. ముంబైలోని బాంద్రాలో తృప్తి డిమ్రి విలాసవంతమైన బంగ్లాని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తృప్తి డిమ్రికి క్రేజ్ వచ్చింది యానిమల్ మూవీతో మాత్రమే. కానీ ఆమె కోట్లాది రూపాయలు పెట్టి భారీ బంగ్లాని తన సొంతం చేసుకుంది. దీంతో అందరం షాక్ అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: కొణిదెల ఉపాసనకు అరుదైన గౌరవం

అది కూడా బాలీవుడ్ అగ్రనటులు షారుఖ్ ఖాన్‌, రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, రేఖ లాంటి సెలెబ్రిటీలు నివాసం ఉండే ప్రాంతంలో తృప్తి డిమ్రి కొత్త ఇల్లు కొనుగోలు చేసిందట. అంతేకాదు ఈ ఇంటి కోసం ఏకంగా 14 కోట్ల రూపాయలతో యానిమల్ బ్యూటీ ఈ ఇంటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తృప్తి డిమ్రి స్టాంప్ డ్యూటీ కోసం 70 లక్షలు, రిజిస్ట్రేషన్ కోసం 30 వేలు చెల్లించినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తృప్తి డిమ్రి భూల్ భూలయా 3 లో యాక్ట్ చేస్తోంది. యానిమల్ మూవీ తర్వాత ఆమెకి చాన్సులు అమాంతం పెరుగుతున్నాయి.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?