Tollywood Heroine Mrunal gave phose to Takur Face Magazine :
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. తొలినాళ్లలో బాలీవుడ్ సీరియల్స్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత మోడల్ గా చేస్తూ సినిమాలలో ఛాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మృణాల్ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. మ్యాగజైన్ కోసం కొన్ని స్టిల్స్ ఇచ్చింది. ది ఫేస్ మ్యాగజైన్ కవర్ పేజీ ముఖచిత్రంగా కనిపించింది. ఈ ఫోటోగ్రాఫ్ లో మృణాల్ ఎంతో బ్యూటిఫుల్ గా డ్యాషింగ్ గా కనిపిస్తోంది. మృణాల్ ట్రెడిషనల్ డిజైనర్ డీప్ పింక్ ఫ్రాక్ ధరించి ఎంతో అందంగా కనిపించింది. ఈ పింక్ ఫ్రాక్ కి కాంబినేషన్ గా మెడలో ఆభరణాలు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో మూడు సినిమాలు చేసిన తర్వాత తెలుగులో సీతారామం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రసంసలు అందుకుంది. కలెక్షన్లలోనూ రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీగా ఆకట్టుకుంది మృణాల్ ఠాకూర్. ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని తో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. హాయ్ నాన్న సినిమా తర్వాత మృణాల్ క్రేజ్ డబుల్ అయ్యింది. వరుసగా సినిమాలు క్యూ కట్టాయి.విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేసింది మృణాల్ ఠాకూర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో మృణాల్ కాస్త నిరాశపడింది. రీసెంట్ గా మరో బ్లాక్ బస్టర్ మూవీలో మెరిసింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది మృణాల్ ఠాకూర్.