Ananya Nagalla: నాలా మోసపోకండి
Ananya nagalla
Cinema

Ananya Nagalla: నాలా మోసపోకండి

Tollywood Heroine Ananya Nagalla advice to public about Ciber crime:

మల్లేశం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ చిత్రంలో మంచి రోల్ దక్కించుకుంది. అయితే ఈ బ్యూటీ ఇటీవల సైబర్ ఉచ్చులో ఇరుక్కున్నానని తనలా ఎవరూ మోసపోవద్దంటోంది. తనను కూడా కొందరు మభ్యపెట్టే ప్రయత్నం చేశారని చెబుతూ షాకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. అంతేకాకుండా తన పేరు మీద ఉన్న సిమ్ పై నేరాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని తనను ఓ వ్యక్తి హెచ్చరించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పలు విషయాలు తెలిపింది. ‘‘నమస్కారం నేను మీ అనన్య నాగళ్ల నేను మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నాను.

ఇదొక సీరియస్ మ్యాటర్. మూడు రోజుల క్రితం నాకు కాల్ వచ్చింది. మనీ ల్యాండరింగ్ నేరానికి పాల్పడ్డానని.. నా నంబర్‌ను 2 గంటల పాటు బ్లాక్ చేస్తామని చెప్పారు. పైగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది అని బెదిరించారు. తర్వాత నాకు అర్థం అయింది ఏంటంటే.. మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అమ్మాయిలను లొంగదీసుకుంటున్నారు. ఏది జరిగినా కానీ వాళ్లు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే వాళ్లు డ్రామాలు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు భయం, ఆశ ఏ ఎమోషన్ అయినా వాడుకుని మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామ్. ఒకవేళ మీరు డబ్బులు పంపితే 1930కి కాల్ చేయండి అకౌంట్ ఫ్రీజ్ చేసి మనీ ఇప్పించేస్తారు పోలీసులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..