Tollywood Hero Vishwaksen Responds Gangs Godavari Movie Reviews
Cinema

Movie Reviews: అలా ఎలా అంటూ రివ్యూలపై విశ్వక్‌ ఫైర్‌

Tollywood Hero Vishwaksen Responds Gangs Godavari Movie Reviews: టాలీవుడ్ మాస్‌ కా దాస్‌ హీరో విశ్వక్‌ సేన్‌, నేహా శర్మ హీరోహీరోయిన్‌గా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి. ఇందులో నటి అంజలి మెయిన్‌రోల్‌ పోషించింది. ఈ మూవీ ఆడియెన్స్ భారీ అంచనాల నడుమ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి స్టార్టింగ్‌ రోజే పాజిటివ్‌ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూవీని ఛల్ మోహన్ రంగ మూవీ ఫేమ్ కృష్ణ చైతన్య తెరకెక్కించగా.. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్‌గా నిర్మించారు.

ఈ మూవీ స్టోరీ పాతది అయినా కూడా దర్శకుడు కృష్ణ చైతన్య తన టేకింగ్‌తో అదరగొట్టాడు. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా రివ్యూలపై చర్చ జరుగుతోంది. మరోవైపు కొంతమంది మూవీ చూడకముందే రివ్యూలు ఇస్తూ సినిమా ఫలితంపై దెబ్బతీస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఈ మూవీకి హిట్‌ టాక్ రావడంతో హీరో విశ్వక్ సేన్‌, డైరెక్టర్‌ కృష్ణచైతన్య ప్రెస్‌ మీట్ నిర్వహించారు. తాజాగా ఇదే అంశంపై హీరో విశ్వక్‌సేన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన యాక్ట్ చేసిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీకి వస్తోన్న రెస్పాన్స్‌, రివ్యూపై మాట్లాడుతూ.. కొందరు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీని చూడకుండానే ఉదయం 6 గంటలకే రివ్యూ రాశారని ఈ సందర్భంగా విశ్వక్ గుర్తు చేశారు.

Also Read: హీరో మహేశ్ ఎమోషనల్‌ పోస్ట్‌ 

అలాగే మూవీకి ప్రధాన బలమైన మ్యూజిక్‌ బాలేదు అంటూ రివ్యూలో ఉందని, అదే బాలేదు అన్నారంటే వారు సినిమా చూడలేదని అక్కడే అర్థమైందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. సినిమాను చూసి అందులోని వీక్‌ పాయింట్‌ను ప్రస్తావిస్తూ రివ్యూస్‌ రాస్తే తప్పు లేదు కానీ.. మూవీని చూడకుండా రివ్యూ ఇవ్వడం ఏమాత్రం సబబు కాదన్నారు. ఈ మేరకు టికెట్స్‌ కొన్నవారే బుక్‌మై షోలో రివ్యూలు రాసుకునేందుకు వీలుగా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!