Tollywood Hero Sudheer Babu Starrer Har Om Hara Movie Official Trailer
Cinema

Trailer Trending: ట్రెండింగ్‌లోకి ట్రైలర్‌, ఈసారి హిట్‌ ఖాయం 

Tollywood Hero Sudheer Babu Starrer Har Om Hara Movie Official Trailer: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు బ్లాక్ బస్టర్ హిట్ కోసం రకరకాల ప్రయెగాలు చేస్తున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ లేకుండా పోయింది. అయినా హిట్‌లతో ఎలాంటి సంబంధం లేకుండా పలు సినిమాలను చేసుకుపోతున్నాడు. గతేడాది హంట్, మామా మశ్చీంద్ర వంటి మూవీస్‌తో వచ్చినా ఆశించిన రిజల్ట్స్ అందుకోలేకపోయాడు. అందువల్ల ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో భారీ స్థాయిలో ఓ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న తాజా మూవీ హరోం హర. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఆడియెన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది ఈ మూవీ. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై తెరకెక్కుతోంది. ఈ మూవీకి సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు.

అయితే సుధీర్ బాబు కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇందులో బలవంతుడికి ఆయుధం అవసరమైతే.. బలహీనుడికి ఆయుధమే బలం అని వచ్చే స్టార్టింగ్ డైలాగ్ అందిరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. సాదా సీదాగా ఊరి మీద తీరిగే వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అతడిని ఊరిలో వాళ్లంతా తిడుతుంటే ఇంట్లో ఉండే భార్య అలాగే అతడి తండ్రి హీరోకి సపోర్ట్‌గా ఉంటుంటారు. మనకి మంచి రోజులు వస్తాయంటూ ఆ మంచి రోజుల కోసం ఎదురుచూస్తుంటారు.

Also Read: వారంలో పెళ్లి, ఏంది మీ లొల్లి..

అయితే ఓ రోజు హీరో గన్ కొనుక్కుంటాడు. దానికి చెల్లించిన డబ్బు తెలిసి ఆశ్యర్యపోతాడు. దీంతో తాను కూడా గన్‌లను తయారు చేయాలని చూస్తాడు. అలాగే గన్‌లను తయారుచేసే పనిలో పడి ఏకంగా గన్ స్మగ్లింగ్ చేసేంత స్థాయికి ఎదిగిపోతాడు. ఆ తర్వాత బడా బడా విలన్‌లకు కూడా వాటిని స్మంగ్లింగ్ చేసేందుకు డీల్ కుదుర్చుకుంటాడు. వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ ట్రైలర్‌లో చూపించారు. ఇక ఆ మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. కాగా అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం వచ్చే నెల అంటే జూన్ 14న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!