Tollywood Exhibitors Decided Not Run Benefit Shows Theaters
Cinema

Benefit Shows: పర్సంటేజీలు ఇచ్చి తీరాల్సిందే..!

Tollywood Exhibitors Decided Not Run Benefit Shows Theaters: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో రోజుకో సమస్య తెరమీదకు వస్తోంది. తాజాగా మరో సమస్య వచ్చి చేరింది. ఇతర రాష్ట్రాలు, దేశాల తరహాలోనే టాలీవుడ్‌లో కూడా ఎగ్జిబిటర్లకు నిర్మాతలు పర్సంటేజీలు ఇవ్వాలని తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్టీఫ్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, లేదంటే థియేటర్ల మూత తప్పదని స్పష్టం చేశారు. నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదు.

గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారు. కొంతమంది డిస్టిబ్యూటర్లు సినీ వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తాం. జులై 1 వరకు టాలీవుడ్‌ సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. ఆ లోపు నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కల్కీ, పుష్ప2, గేమ్ చేంజర్ , భారతీయుడు సినిమాలను మాత్రం పాత పద్దతిలోనే ప్రదర్శిస్తామని విజయేందర్‌ రెడ్డి అన్నారు.

Also Read: నటి ఎమోషనల్, 15 లక్షలు లాస్‌ అంటూ…!

కాగా, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదని, ఎక్కువగా నష్టాలు వస్తునాయని చెబుతూ పది రోజులు వరకు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్ అయ్యే ఉన్నాయి. మే 25 ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు