Tamanna inspired byi a movie House of wax
Cinema

Tamanna : ఇక ఆ పని చేయడం మానేశా

Tamanna Bhatia: సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ ఎవరని అడిగితే తమన్నా అని చెప్పేస్తారు ఠక్కున. 19 ఏళ్ల కెరీర్ లో తమన్నాగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామకు ఇప్పటికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. కానీ ఆమె సరైన కథ ఎంచుకోలేకపోతుంది. బాహుబలి తరువాత తమన్నా పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు. ఈ సినిమా తర్వాత పైగా మరింత కిందకి వెళ్లి నట్టుగా అనిపించింది. తమన్నాకు ఇంత వరకు మంచి కమర్షియల్ హిట్ పడలేదనే చెప్పాలి. ఈమెకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది. స్టార్ హీరోలతో నటిస్తూనే యంగ్ హీరోలతో కూడా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బన్నీతో కలిసి తమన్నా నటించింది. ఆమె కెరీర్‌లో హిట్‌ల కంటే ఫ్లాపులే ఎక్కువ. అయితే తన అందం, పర్సనల్ ఇమేజ్‌తో హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది.

హౌస్ ఆఫ్ వ్యాక్స్ తెచ్చిన మార్పు

సినిమాలో కొన్ని సీన్స్‌ చూసి మళ్లీ అలాంటి పని చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. మనమే కాదు సినిమాల్లో నటించిన వాళ్లు కూడా అలానే అనుకుంటూ ఉంటారు. ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్‌ ఉంటే తమన్నా చెప్పిన మాటలు ఒకసారి చదవండి మీకూ అర్థమైపోతుంది. కొత్త సినిమా ‘బాక్‌’ ప్రచారం కోసం వచ్చిన తమన్నా సినిమా గురించి చెబుతూ, తన గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది. ఓ సినిమా చూశాక తనకున్న ఒక అలవాటును పూర్తిగా మానేసినట్లు చెప్పుకొచ్చింది. ఈమె హాలీవుడ్ లోని ‘హౌస్ ఆఫ్ వ్యాక్స్’ సినిమా చూశాక తన చర్మం పై వెంట్రుకలు తొలగించడం పూర్తిగా మానేశాను అని ఆ సినిమాలో వ్యాక్స్ తో పలు రకాలుగా చంపేస్తారు అని , ఆ మూవీ తర్వాత నుంచి చర్మంపై రోమాలను తొలగించడం మానేసినట్లు మిల్కీ బ్యూటీ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పింది.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?