Tollywood actress Aiswarya Menon : అయినా తగ్గని ‘వాయువేగం’
Aiswarya menon
Cinema

Aiswarya Menon:అయినా తగ్గని ‘వాయువేగం’

Tollywood actress Aiswarya Menon upcoming movie Bhaje vayu vegam highlites:
సినిమా ఇండస్ట్రీలో పదేళ్లకు పైగా ఉంటూ చిన్న పాత్రలనుంచి హీరోయిన్ దాకా ఎదిగిన నటి ఐశ్వర్య మీనన్. తెలుగులో సిద్ధార్థ్ లవ్ ఫెయిల్యూర్ మూవీతో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన ఐశ్వర్య మీనన్ తర్వాత స్పై మూవీలో తన స్టయిలిష్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అయినా ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఇప్పటిదాకా చెప్పుకునే స్థాయిలో సినిమాలు చేయని ఐశ్వర్య మీనన్ ప్రస్తుతం కార్తికేయ సరసన ఈ నెల 31న భజే వాయువేగం మూవీతో రాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత తన కెరీర్ స్థిరపడిపోతుందని…వాయువేగంతో కొత్త ఛాన్సులు వస్తాయని కలలు కంటోంది. కచ్చితంగా మూవీ సక్సెస్ అవుతుందని భావిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో ఐశ్వర్య మీనన్ తన గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ

తమిళనాడులో ఈరోడ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. కాలేజీ డేస్ లో ఉన్నప్పుడే కమర్షియల్ యాడ్స్ లో నటించా. ఇంజనీరింగ్ తర్వాత పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేశాను. ఆఫర్స్ సంగతి ఎలా ఉన్న ప్రేక్షకుల యాక్సప్ట్ పొందడం అనేది ఇండస్ట్రీలో ముఖ్యం. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యాను. కెరియర్ పరంగా గుర్తింపు పొందడం కోసం ప్రయత్నిస్తున్నాను. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో సినిమాలు చేస్తున్నా. సినిమాలు చేస్తున్నప్పుడు మన పాత్ర వరకు పూర్తిగా న్యాయం చేయడం ముఖ్యం. ఇక సినిమా ఫలితం అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. స్పై మూవీ తర్వాత చాలా తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చాయి. సెలక్టివ్ గా మంచి కథలు ఎంపిక చేసుకొని మూవీస్ చేస్తున్నాను. భజేవాయువేగం చిత్రంలో ట్రెడిషనల్ గా కనిపించే అమ్మాయి క్యారెక్టర్ నాది. ఎక్కువగా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లోనే మూవీలో కనిపిస్తాను. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. త్వరలో వాటి వివరాలు తెలుస్తాయి. అలాగే తమిళ్, మలయాళంలో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. భజే వాయువేగం మూవీ కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను అని ఐశ్వర్య మీనన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Just In

01

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు