96 oscar awards 2024
Cinema

Oscar Awards 2024 : ఘనంగా 96వ ఆస్కార్ అవార్డ్స్, విజేతలు వీళ్లే.

This is The Full List of 96th Oscar Awards And Nominations: సినీ ప్రపంచం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవి ఆస్కార్ అవార్డ్స్. ఈ అవార్డులను ప్రతి యేటా గ్రాండ్ ఈవెంట్ అతిరథ మహారథుల మధ్య ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్కార్స్ 2024 వేడుకలు ఈవెంట్ లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగాయి. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగాయి. ఈసారి భారతీయ సినిమాలు గానీ భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ పురస్కారాలు దక్కలేదు. మరోవైపు చాలామంది ఊహించినట్లే ‘ఓపెన్ హైమర్’ సినిమాకు ప్రధాన విభాగాల్లో ఏకంగా ఏడు అవార్డులు రావడం విశేషం.

దీంతో పాటు ‘పూర్ థింగ్స్’ అనే మూవీకి నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. 96వ అకాడమీ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్‌ను లిస్టు రిలీజ్ చేశారు. కేటగిరీల వారీగా నామినీల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ విభాగంలో 10 మంది నామినీలు ఉన్నారు. అమెరికన్ ఫిక్షన్, అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, బార్బీ, ది హోల్డోవర్స్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, మాస్ట్రో, ఓపెన్‌ హైమర్, పాస్ట్ లివ్స్, పూర్ థింగ్స్, ది జోన్ ఆఫ్ ఇంటెరెస్ట్

ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులనేది పూర్తి జాబితా ఇదిగో..

ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్
ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటుడు – రాబర్డ్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ)
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ – వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)
బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌– 20 డేస్ ఇన్ మరియూపోల్
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే– కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే – జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ – ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ – ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ – ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్‌న్)
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)
బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌ – ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్)
బెస్ట్‌ సౌండ్‌ – ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ – జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌ – నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం-ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం- వార్ ఈజ్ ఓవర్
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం- ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం