Actress kiran Rathod | నటి ఎమోషనల్, 15 లక్షలు లాస్‌ అంటూ...!
The Actress Is Emotional, Saying 15 Lakhs Loss
Cinema

Actress kiran Rathod: నటి ఎమోషనల్, 15 లక్షలు లాస్‌ అంటూ…!

The Actress Is Emotional, Saying 15 Lakhs Loss: తెలుగులో ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో నటి కిరణ్ రాథోడ్ ఒకరు. ఈ అమ్మడు సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొని మంచి ఐడెంటీటీని తెచ్చుకుంది. కానీ విన్నర్ కాలేకపోయింది. ఇక బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టీవ్‌ అయిపోయింది. పలు పోస్టులతో సంచలనం సృష్టిస్తోంది.

అలాగే తన హాట్ హాట్ అందాల ఫొటోలతో తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో షేరు చేసుకుంటుంది.ఈ క్రమంలో తాజాగా కిరణ్ రాథోడ్ ఏకంగా రూ. 15 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మే 13న నా సినిమాతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లాల్సి ఉంది. మా టీమ్ అంతా అక్కడే ఉన్నారు. స్క్రీనింగ్, లాంఛింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. వీసా కోసం నెల రోజులుగా ఎదురు చూస్తున్నాను.

Also Read: హీరో నాగచైతన్యపై నటి సమంత పోస్ట్, వైరల్

15 లక్షల నష్టం వాటిల్లింది. నా హోటల్ బుకింగ్ అంతా అయిపోయింది. కానీ వీసా మాత్రం రాలేదు. నేను ఇప్పటికీ నా పాస్‌పోర్ట్‌ని ట్రేస్ చేయలేకపోయాను. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. నాకు సమాధానం కావాలని రాసుకొచ్చింది. అలాగే నెట్టింట కొన్ని పేపర్స్ కూడా షేర్ చేసింది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్‌ డోంట్‌ వర్రీ మేడమ్‌ డోంట్‌ థింక్‌ అంటూ రాసుకొస్తున్నారు. అంతేకాకుండా తనలో ఆత్యస్థైర్యాన్ని నింపేందుకు సలహాలను అందిస్తున్నారు.

Just In

01

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి

Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు